మనం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం అతి తక్కువ వయసులోనే వివాహం చేసుకొని చాలా ఇబ్బంది పడిన జంటలను. అంతేకాకుండా తెలిసీ తెలియని వయసులో ప్రేమ అనే ఒక్క కారణంతో ఎంతోమంది అతి చిన్న వయసులోనే వివాహం జరుపుకొని కొన్ని కారణాలవల్ల విడిపోతూ ఉంటారు. ఇలాంటి సమస్యలన్నింటికీ ముఖ్య కారణం అతి చిన్న వయసులోనే వివాహం చేసుకోవడం.
1). లేటు వయసులో వివాహం చేసుకున్నారు విడిపోయే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే సమాజంలో జరిగేవన్నీ చూస్తూ, వింటూ ఉండడం వల్ల మనము కూడా సమాజంలో ఎలా ఉండాలో అర్థం అవుతుంది.
2). లేటు వయసులో వివాహం చేసుకుంటే భార్య భర్తలు ఇద్దరూ ఒకరికొకరు బాగా అర్థం చేసుకుంటారు.
3). 20 సంవత్సరాల కే వివాహం చేసుకున్నారంటే వారికి తన భార్య మీద ప్రేమ ఎలా చూపించాలో తెలియక ఇబ్బంది పడుతుంటారు. అందుచేతనే లేటు వయసులో వివాహం చేసుకున్నట్లుయితే భార్య భర్తలు ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు.
5). అతి చిన్న వయసులోనే వివాహం చేసుకొని, పిల్లల్ని కని, ఆ తర్వాత ఏదో మిస్ అవుతున్నామనే ఫీలింగ్ చాలా మందికి కలుగుతూ ఉంటుంది. ఇక వారికి తెలియకుండానే ఎన్నో బాధలు,బాధ్యతలు వస్తాయి. ఇక వారికి ఏం చేయాలో తెలియక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అందుచేతనే ఒక వయసు వచ్చాక బాధ్యతలు అంటే ఇలా ఉంటాయి అని తెలుసుకున్న తర్వాత వివాహం చేసుకుంటే బాధలు, బాధ్యతలను ఫేస్ చేయగలరు.