
అయితే కొంతమంది ఏకంగా పాములు పగ పడతాయా అన్న విషయాన్ని ఏకంగా అనుభవంతో కూడా ఎదుర్కోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఇక్కడ జరిగిన కూడా ఇలాంటి కోవలోకే వస్తుంది. ఏకంగా నాగుపాము పగ పడుతుంది అన్న దానికి ఇక్కడ జరిగిన ఘటన నిదర్శనంగానే మారిపోయింది. ఇక్కడ ఒక నాగుపాము ఏకంగా పోలీస్ స్టేషన్ ముందుకు వెళ్లి బుసలు కొట్టడం స్థానికంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఉత్తరప్రదేశ్లోని ఆజంగఢ్ జిల్లాలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. మహ్ నగర్ లో రెండు పాములు పెనవేసుకున్నాయి.
ఇంతలో అటువైపుగా ఒక కారు రావడంతో ఒక పాము కారు టైర్ కింద పడి చివరికి చనిపోయింది. అయితే జంట పాము కనిపించక పోవడంతో ఇక నాగుపాము కొంత దూరం నుంచి కారును వెంటాడింది. అయితే ఇక రెండు రోజుల వరకు పరిసరాల్లో తిరుగుతూ ఉండడాన్ని గమనించిన స్థానికులు పాము పగ పట్టిందని.. జంట పామును చంపిన వారికోసమే వెతుకుతుంది అని అనుకున్నారు. కాసేపటికి ఆ పాము పోలీస్ స్టేషన్ లోకి వెళ్ళింది పోలీస్ స్టేషన్ ముందు బుసలు కొట్టడం మొదలు పెట్టింది. దీంతో అందరూ అప్రమత్తమయ్యారు. ఇక అతి కష్టం మీద ఆ పామును పట్టుకుని సమీపంలో ఒక చెత్త బుట్టలో వేశారు. తర్వాత అటవీ సిబ్బంది అక్కడికి చేరుకుని సమీపంలోని అడవిలోకి వదిలారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది.