అయితే దీనికి సంబంధించిన వీడియో కాస్త వైరల్ కావడంతో పోలీసులు ఆ యువతి పై కేసు నమోదు చేసి విచారణ కూడా ప్రారంభించారు. అయితే ఇక ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో కూడా అచ్చం ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ క్యాబ్ డ్రైవర్ ను చెంప దెబ్బ కొట్టడమే కాదు పిడిగుద్దులు కూడా కురిపించింది ఒక మహిళ. పటేల్ నగర్ లో ఈ ఘటన వెలుగు చూసింది. ఓ మహిళ క్యాబ్ డ్రైవర్ ను నడిరోడ్డు పైన పట్టుకుని చెంపలపై ఎడాపెడా వాయించి.. పిడి గుద్దులు కురిపించింది.
ఇక అటువైపుగా వెళ్తున్న వాహనదారులు ఆ మహిళ నివారించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఇక అక్కడ వచ్చి ఆపేందుకు ప్రయత్నిస్తున్న వారితో కూడా వాగ్వివాదానికి దిగింది సదరు మహిళ. ఈ క్రమంలోనే ఇక అక్కడ ఉన్న వారిలో ఒక వ్యక్తి ఈ వ్యవహారాన్ని మొత్తం వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో ఇక ఈ వీడియో కాస్త వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో చూస్తుంటే మహిళ కొడుతుంటే క్యాబ్ డ్రైవర్ అలాగే అమాయకంగా నిలబడి ఉండి పోయాడు కానీ ఇక ఈ ఘటనను చూసి పక్కన ఉన్న వాళ్ళు ఎంతో ఆగ్రహానికి గురయ్యారు. ఈ క్రమంలోనే మహిళను ఆపేందుకు కూడా గొడవకు దిగింది సదరు మహిళ.