సాధారణంగా మనం ఎప్పుడైనా పోలీసులను చూస్తూ ఉంటాం ఇక ట్రాఫిక్ పోలీసులు అయితే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మనం ఎప్పుడు బయటకు వెళ్ళిన ట్రాఫిక్ పోలీసులు మనకు కనిపిస్తూనే ఉంటారు.. పోలీస్ ఎడమ భుజానికి ఒక తాడు ఉండడం చూసి ఉంటారు..? ఒకవేళ చూసిన ఎందుకు ఈ తాడు అమర్చారు అనే విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా..? లేదా ఎవరైనా ఈ తాడును ఎందుకు అమర్చారు అనే విషయానికి సమాధానం ఎవరి దగ్గరైనా అడిగి తెలుసుకున్నారా..? మీకు సమాధానం తెలియకపోతే ఇప్పుడు క్లారిటీగా పోలీసులకు ఎడమవైపున మాత్రమే ఎందుకు తాడు ఉంటుంది అనే విషయాన్ని ఇక్కడ వివరించడం జరిగింది.. ఇక మీ మనసులో మొదలయ్యే ఈ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం తెలుసుకుందాము..
సాధారణంగా కానిస్టేబుల్ స్థాయి నుంచి ఉన్నత ఆఫీసర్ల వరకు అలాగే ట్రాఫిక్ పోలీసులకు ఎడమవైపు భుజానికి ఒక తాడు లాంటిది ఉంటుంది అయితే అసలు ఎందుకు ఈ తాడు అనేది పడతారు అనే విషయానికి వస్తే.. ఈ దాడులకు చివరి భాగాన ఒక విజిల్ లాంటిది అమర్చబడి ఉంటుంది జోబులో పెట్టుకోవాల్సి ఉంటుంది. అత్యవసర పరిస్థితులలో వారికి ఉపయోగపడే విధంగా ఉండేందుకు ఆ తాడును అక్కడ ఉంచుతారట. అయితే ఎక్కువగా ఇది ట్రాఫిక్ పోలీసులకు బాగా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు.
ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులు ఎక్కువగా విజిల్ తో నే ఎక్కువగా ట్రాఫిక్ ని కంట్రోల్ చేస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక అంతే కాకుండా ఆ విజిల్ ఎక్కడపడితే అక్కడ వేయకుండా సపోర్టుగా ఉండేందుకు ఆ తాడును ఉపయోగిస్తారట. అందుచేతనే ఆ విజిల్ మిస్ అవకుండా ఉంటుంది.మనకు ఎక్కువగా ఎరుపు, నల్లటి రంగు లో ఉన్నటువంటి తాడులు మాత్రమే కనపడతాయి. ఈ తాడు పొజిషన్ను బట్టి మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఎరుపు రంగు si ke, నీలం రంగు CI,DSP లకు కలదు.. కానిస్టేబుల్ కు నల్లరంగు తాడు కలదు..