ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన ఆటలలో ఫుట్బాల్ కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. అయితే ఫుట్బాల్  ఆడుతున్న ప్రతి ఆటగాడు కూడా గోల్ చేయడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటాడు. గ్రౌండ్ లో ఉన్న అందరూ ఆటగాళ్లను తప్పించుకొని గోల్ చేయడానికి పరుగులు పెడుతూ ఉంటాడు. ఇలా ప్రతి ఒక్క ఆటగాడికి కూడా గోల్ చేయాలనే కోరిక ఉంటుంది. ఇలా ఒక్కసారి ఫుట్బాల్ ఆటలో గోల్ చేశాడు అంటే క్రీడాకారులు ఎంతలా సెలబ్రేట్ చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే మైదానంలో ఆటగాడు కాదు ఏకంగా ఒక జంతువు ఫుట్బాల్ గోల్ చేస్తే ఎలా ఉంటుంది.


 ఒక జంతువు ఫుట్బాల్ గోల్ చేస్తే బాగానే ఉంటుంది కానీ అలా ఎందుకు చేస్తుంది అని అంటారు ఎవరైనా. కానీ ఇక్కడ ఒక జింక ఏకంగా ఫుట్బాల్ గోల్ చేసి తెగ సంబరపడిపోయింది.. ఫుట్ బాల్ ఆట ఎక్కడ చూసిందో తెలియదు కానీ అచ్చం ఫుట్బాల్ క్రీడాకారులు లాగానే ప్రవర్తించడం మొదలుపెట్టింది ఆ జింక. ఆ తర్వాత కష్టపడి గోల్ చేసి ఎంతగానో సంబరాలు చేసుకుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. 2019 లో జరిగిన ఈ ఘటనను ఇటీవలే పర్యావరణవేత్త స్టీవర్ట్ విలియమ్స్ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు.



 అయితే ఈ ఘటన ఎక్కడ జరిగి ఉంటుంది అన్న దానిపై మాత్రం స్పష్టత లేదు ఇక ప్రస్తుతం ఈ వీడియో కాస్త నెట్టింట్లో వైరల్ గా మారిపోతుండటంతో ఇది చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంతేకాదండోయ్ ఈ జింకకు ఫుట్బాల్ శిక్షణ ఎవరు ఇచ్చారు. కోచ్ ని అని పిలవండిరా అబ్బాయిలు అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే కేవలం ఫుట్బాల్ ఆటలో మాత్రమే కాదు గతంలో క్రికెట్ మైదానంలోకి పెంపుడు జంతువులు ఎన్నో పరుగులు పెట్టుకుంటూ వచ్చి క్రికెట్ బంతిని నోట్లో పెట్టుకుని మైదానం మొత్తం పరుగులు పెట్టించిన ఘటనలు కూడా ఎన్నోసార్లు వెలుగులోకి వచ్చాయి అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: