ఈరోజుల్లో టెక్నాలజీ కన్నా స్పీడ్ గా మనుషుల తెలివి పెరిగి పోతుంది. చెట్లు ఎక్కడానికి కొత్త కొత్త పరికరాలను కనిపెడుతూనే ఉన్నారు.. ఇప్పటికీ ఎన్నో పరికరాలు వచ్చాయి. అబ్బురపరిచే వాటితో రికార్దులను అందుకున్నారు. ఇప్పుడు ఒక పెద్దాయన కొబ్బరి చెట్లు ఎక్కడానికి ఒక కొత్త మోటార్ మిషన్ ను తయారు చేసాడు.. దాని సాయంతో అతను చెట్టు పైకి వెళ్ళి కాయలను తెంచుతున్నారు. ఎన్నో వందల కాయలను దింపుతూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు.
ఓ వ్యక్తి చెట్లను చేతుల తో పట్టుకోకుండా ఎక్కు తున్నారు. మాములుగా చెట్లను ఎక్కాలంటే చేతులు కాళ్ళు బాగా పనిచెయాలి. లేదంటే కష్టం కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. చెట్లు ఎక్కుతాను కానీ చేతులు, కాళ్ల అవసరం లేదని ఒక వ్యక్తి నిరూపించారు.. అందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కోడుతుంది. ఆ వీడియోను చూస్తే ఎవరికైనా తెలుస్తుంది.
ఎక్కడా చెట్టును టచ్ చేయకుండా బైక్ ఎక్కినట్లు ఎక్కుతున్నారు. ఎక్కడా టచ్ చెయ్యకుండా నేలపై నుంచి చెట్టు పైకి వెళ్లిపోతున్నాడు. రోడ్డుపై బైక్ తోలినట్లుగా,చెట్టుకి సెట్ చేసిన యంత్రంపై కూర్చొని హ్యాందిల్ ని పైకి అంటూ అలా తేలిగ్గా చెట్లు ఎక్కుతున్నాడు.అందుకే ఆ వీడియో నెట్టింట జోరుగా చక్కర్లు కోడుతుంది.. ఇన్‌స్టాగ్రామ్ లో ఓ వ్యక్తి వీడియో ను పోస్ట్ చేశారు. ఇలాంటివి మన రాష్ట్రం లో అందుబాటులో లేవు కానీ వేరే రాష్ట్రాలలొ ఉన్నాయి. ప్రస్తుతం కర్ణాటక, గోవా లో నిత్యం దర్శనం ఇస్తున్నాయి.యంత్రాన్ని పూర్తిగా దేశీయ టెక్నాలజీ తోనే తయారుచేశారట.. మొత్తానికి ఇది వైరల్ అవుతుంది. దెబ్బకి ఫెమస్ అయ్యాడు. మీరు కూడా ఆ వీడియో ను ఒకసారి చూడండి.అతని ఆలోచన పై ప్రశంసలు కురుస్తున్నాయి. అలాంటి
ఐడియా మనకు ఎందుకు రాదు అంటూ కామెంట్లు కూడా పెట్టడం విశేషం.