కరోనా మహమ్మరి మొదలైనప్పటి నుంచి మాస్క్ లకు డిమాండ్ పెరిగింది. శ్వాస ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్న నేపథ్యంలో మాస్క్ లను పెట్టుకోవడం వాడుకలోకి వచ్చింది. అయితే కరోనా వ్యాక్సిన్ వచ్చిన ప్పటి నుంచి మాస్క్ లు పెట్టుకోవడం మర్చిపోయారు.. ఆమాస్క్ లను మనవాళ్ళు వివిధ రకాలుగా వాడుతూ సోషల్ మీడియాలో రచ్చ చెస్తున్నారు. ముఖ్యంగా పోలీసుల నుంచి బయట పడటానికి చావు తెలివిని చూపిస్తున్నారు. ఇప్పుడు జరిగిన సంఘటన మాత్రం చూస్తె నవ్వు ఆపుకొలెరు.


విషయాన్నికొస్తే.. హైదరాబాద్‌లో కొంతమంది యువకులు ఇలా బైక్‌ నంబర్‌ ప్లేట్‌ను మాస్క్‌తో మూసేసి పోలీసుల కెమెరాలకు చిక్కకుండా తిరుతున్నారు. ఇలాంటి యూత్ ఏదైనా ప్రమాదం లో చిక్కుకుంటే మాత్రం దొరకడం చాలా కష్టం అంటున్నారు పోలీసులు.. ఇలాంటి వారి పట్ల  పోలీసులు కఠినంగా వ్యవహరించకుంటే ఇది ప్రమాదమేనని కొందరు ప్రజలు హెచ్చరిస్తున్నారు.. వీరు పొయ్యెది కాకుండా మరి కొంత మంది ప్రాణాలను కూడా తీస్తారు అంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చెస్తున్నారు.


హైదరాబాద్ చింథల్ లో ఇటువంటి ఘటనలు జరగడం చూస్తూ ఉంటాము.. అక్కడ వాళ్ళు పోలీసుల దెబ్బకు వెనక్కు తగ్గలేదు. నంబర్‌ ప్లేట్‌కు మాస్కు పెట్టి యువకులు ఇలా ట్రిపుల్‌ రైడింగ్‌లో వెళ్తున్నారు.ఒమిక్రాన్‌ కేసులు కూడా పెరుగుతున్నాయి. వ్యక్తిగత పరిశుభ్రత, మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించాలని ప్రభుత్వాలు మరోసారి కఠినంగా వార్నింగ్ ఇస్తున్నారు.. ఒకవైపు భయ పెట్టె కరోనా కొత్త వేరియంట్.. మరో వైపు రోడ్డు ప్రమాదాలు జనాలను భయాందోళన కు గురి చేస్తున్నాయి..ఇటువంటివి జరగకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.. ఇప్పుడు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రోజురోజుకు పెరిగి పోతున్నాయి.. స్వీయ నిబంధనలను అనుసరిస్తూ జాగ్రత్తలు తీసుకొవాలని హెచ్చరిస్తున్నారు.. ఇప్పటికే ఈ కేసులు టెన్షన్ పెట్టిస్తున్నాయి.. బీ సేఫ్.. బీ హ్యాపీ..




మరింత సమాచారం తెలుసుకోండి: