
ఇక్కడ ఓ వృద్ధుడు చనిపోయాడు.. ఇక బంధువులందరూ కూడా ఇంటికి చేరుకుని బోరున విలపించారు. బాధాతప్త హృదయాలతో ఆ వృద్ధుడికి అత్యక్రియలు నిర్వహించాలని భావించారు. ఈ క్రమంలోనే స్మశాన వాటికకు తీసుకెళ్లి అక్కడ చితి పైన పడుకోబెట్టారు. చివరిగా వృద్ధుడి నోట్లో గంగాజలం పోశారు. కానీ ఆ తర్వాత అందరూ షాక్ అయ్యారు. మరికొద్ది సేపట్లో చితికి నిప్పంటించారు అనుకుంటున్న సమయంలో వృద్ధుడు కళ్ళు తెరిచి మాట్లాడటం మొదలుపెట్టాడు. దీంతో అందరూ ఒక్కసారిగా షాకయ్యారు. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని టిక్రి ఖుర్ద ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
చితి పై ఉన్న మృత దేహం ఒక్కసారిగా కళ్లు తెరిచి మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే చనిపోయిన వ్యక్తి మళ్లీ మాట్లాడటం ఏంటి అందరూ ఆశ్చర్యపోతున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగింది అని తెలుస్తోంది. వృద్ధుడు చనిపోయాడు అంటూ వైద్యులు తప్పుగా ధృవీకరించడం వల్లనే ఈ ఘటన జరిగిందని తెలుస్తోంది. సతీష్ భరద్వాజ అనే 62 ఏళ్ల వ్యక్తి క్యాన్సర్తో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే అన్ని ఏర్పాట్లు చేసి అతని స్మశాన వాటికకు తీసుకెళ్లి పడుకోబెట్టి గంగాజలం నోట్లో పోయగానే అతను మాట్లాడటం మొదలుపెట్టాడు. దీంతో అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు.