ఇన్‌స్టాగ్రామ్‌లో అకౌంట్‌లో ఇటీవల పోస్ట్ చేసారు. ఇందులో ఓ పెద్దాయన నిప్పుతోనే చెలగాటం ఆడాడు. మండుతున్న ఓ కర్రను తీసుకొని పర్యాటకుల ముందు ఏదో విజ్ఞాన ప్రదర్శన లాంటిది చేద్దామని అనుకున్నాడు. కానీ ఆ కర్రను తన షార్ట్‌పై అలా అలా రాసాడు. అయినా షార్ట్‌కి మంటలంటుకోలేదు. వెంటనే మండుతున్న కర్రను షార్ట్ లోపలికీ ప్రయివేటు పార్ట్‌లోకి జొప్పించాడు. కొద్ది సేపు అలాగే ఉంచాడు. ఆ తరువాత బయటికీ తీసాడు. అప్పుడు ఆ కర్ర కాలుతూనే ఉన్నది. ఆ తరువాత ఇక అసలు సమస్య మొదలైనది.
అతనికీ ఆ స్టంట్ చాలా తేడాగా కొట్టిందట. ప్రయివేటు పార్టుకు మంట అంటుకోవడంతో సర్రుమన్నది. అంతే.. ఇక లబోదిబోమని మొత్తుకుంటూ, అరుస్తూ ఉన్నాడు. ఈ తతంగం చూసిన నెటిజన్లు మాత్రం పగలబడి పకపక నవ్వుతూ ఉన్నారు. చూసారు గదా ఇదీ పరిస్థితి ఏవిధంగా ఉందో.. ఎవరు అయినా ఇలాగా చేస్తారా..? అవసరమా ఇది అంతా.. స్టంట్ చేయాలనుకుంటే ఆ కర్రనే కాసేపు గాల్లో అటు ఇటు తిప్పి ఉంటే ఈ తిప్పలు వచ్చేవి కావు కదా అంటున్నారు.
మరొకవైపు తుఫాన్‌లాగా వైరల్ అయినా అతని స్టంట్స్.. మళ్లీ మళ్లీ చూసి నవ్వుతూ ఉన్నారు. కామెంట్స్ కూడా అదే రేంజ్‌లో వస్తూ ఉన్నాయి. అంతా అయిపోయింది అని చాలా మంది కామెంట్ చేయడం విశేషం. కొంత మంది అయితే అలా ఎందుకు చేసావు అని ఓ యూజర్ ప్రశ్నల వర్షమే కురిపిస్తున్నారు. చేసింది చాలక చూసుకుంటున్నావా అని మరికొందరూ యూజర్లు ప్రశ్నిస్తున్నారు. ఖతం అయిపోయింది బైబై అని మరొక యూజర్ కామెంట్ చేసారు. ఇలా ఆ పెద్దాయన నిప్పుతో చెలగాటం ఆడే తతంగం సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది.