జంతువు ఏంటి మనుషులకు కాపలా కాయడం ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతున్నారా..? మీరు విన్నది కూడా నిజమే.. ఆ గ్రామంలో ఒక కొండముచ్చు విద్యార్థుల పాలిట బాడీగార్డ్ ల మారిందట.. నిత్యం విద్యార్థులను రక్షిస్తూ ఉంటుంది.. అదేంటి అనుకుంటున్నారా..? అయితే., అసలు విషయం మీరు తెలుసుకోవాల్సిందే. జగిత్యాల జిల్లాలోని మల్యాల మండలంలో ఉన్న తాటి పల్లి అనే గ్రామంలో ఇలాంటి వింత పరిస్థితి ఎదురైంది.ఆ గ్రామములో కోతుల బెడద చాలా ఎక్కువగా ఉందట..పంటలు నాశనం చేయడంతో పాటు,ఇళ్లలోకి దూరి మరి ఆగం ఆగం చేయడం లాంటివి మరి ఎక్కువ అయిపోయాయి.

విద్యార్థుల పరిస్థితి గురించి అసలు చెప్పనవసరం లేదు అనుకోండి. విద్యార్థులు స్కూల్ కి వస్తున్న సమయంలోనూ, తరగతులు జరుగుతున్న సమయంలో అలాగే ఇంటికి వెళ్తున్న సమయంలోను కోతుల వల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది.
ఎలా అంటే ఒక రోజు స్కూల్ ఆవరణలో అసెంబ్లీ జరుగుతుండగా ఒక కోతి వచ్చి ఆ పాపను వెనకనుండి వచ్చి కొట్టి వెళ్ళిపోయింది. దెబ్బకు ఆ పాప కిందపడి ఉంది. లేచి చూస్తే అక్కడ అది కనిపించలేదు.


ఏమి చేయాలో తెలియని పరిస్థితుల్లో స్కూల్ సిబ్బంది కోతుల బారి నుంచి విద్యార్థులను కాపాడడానికి ఒక వినూత్నమైన ఆలోచన చేసారు. కోతులను కంట్రోల్ చేయాలంటే కొండముచ్చునే కరెక్ట్ అని భావించి దానిని తీసుకొని వచ్చి స్కూల్ ఆవరణలోనే ఒక చెట్టుకి కూడా కట్టేశారు దీంతో కోతుల బెడద కొంతవరకు తగ్గిందనే చెప్పాలి. నిజానికి ఈ మల్యాల మండలంలో కొండగట్టు అనే ఒక పుణ్యక్షేత్రం ఉందట.ఇక్కడే ఎక్కువ శాతం కోతులు సంచరిస్తూ ఉంటాయి.అలాగే పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులు సైతం కోతులకు ఆహార పదార్థాలను ఇస్తుంటారు. ఇలా ఈ ప్రాంతంలో కోతుల సంఖ్య క్రమంగా పెరిగిపోవడంతో వాటి నుంచి తప్పించుకోవడానికి ఇలా కొండముచ్చుని బాడీగార్డ్ లాగా పెట్టుకున్నారు.

మండలంలోని గ్రామాల్లో కోతుల బెడద పెరుగుతున్న క్రమంలో వాటి లెక్కను అంచనా వేయడానికి ప్రభుత్వం సర్వే కూడా నిర్వహిస్తుంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ విస్తరణ అధికారులు పల్లెల్లో తిరుగుతూ వివరాలు పొందుపర్చాల్సిగా ఉంటుంది. అసలు ఇక్కడ గ్రామాల్లో ఎన్ని కోతులు ఉన్నాయి..? ఎంత మేరకు పంటలను ధ్వంసం చేశాయి..? ఆ కోతులు ఎక్కడ ఎక్కడ ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. అనే అంశాలను వారు తెలుసుకోవాలి. ఆ గ్రామాల్లో గల రైతులతో మాట్లాడిన తర్వాత వివరాలను ఆన్ లైన్.. క్రాప్‌ బుకింగ్‌ మాడ్యూల్లో నమోదు చేయాల్సి ఉంటుందట.. కోతుల బెడద నుంచి తప్పించుకోవడానికి ఏమి ఏమి ప్రయత్నాలు చేసారో అనే విషయాలను కూడా ఆన్లైన్ లో వారు పొందుపరచాలిసి ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: