సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా అనిపించినా మరికొన్ని ఆశ్చర్యకరంగా ఉంటాయి. వాస్తవానికి కారణం లేకుండా ఎవరినీ ఇబ్బంది పెట్టకూడదంటారు కదా మన పెద్దలు.
ఎందుకంటే కొన్నిసార్లు పరిణామాలు చాలా ప్రమాదకరంగా మారతాయట . ఓ మహిళ ఎలాంటి కారణం లేకుండా సరదా కోసం గేదెను వేధించిందట.అయితే.. ఆమె అస్సలు ఊహించి ఉండదు అలా జరుగుతుందని.. అందరినీ.. నవ్విద్దామనుకున్నదట ఆమె చివరకు బొక్కబోర్లాపడింది. గెదెపై గెంతులు వేద్దామనుకున్నా ఈ చిన్నదానికి తగన శాస్తి జరిగిందంటూ అందరూ పేర్కొంటున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేస్తోంది.
చాలా సార్లు కొందరు అయితే ఎలాంటి కారణం లేకుండా సరదా కోసం ఇతరులను బాగా వేధిస్తుంటారు . వైరల్ అవుతున్న వీడియోలో నిలబడి ప్రశాంతంగా ఉన్న గేదెను మనం చూడవచ్చు. అదే సమయంలో దాని దగ్గర ఓ మహిళ నిలబడి ఉంటుంది. ఆమె తన చేతులను గేదెపై వేసి దానిని ఆటపట్టిస్తుంటుంది. ఆ తర్వాత గెదె తలపై తన పాదాలను ఉంచుతుందట . ఇలా చేస్తూ మహిళ సంతోషపడుతుంటుంది. వెంటనే గేదెపై కూర్చోవడానికి కూడా ప్రయత్నిస్తుంది. కానీ, గేదె తలను మాత్రం వెనక్కి లాగుతుంది. ఈ క్రమంలో మహిళ బొక్కబోర్లాగా కిందపడిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూసేయండి
ఈ ఫన్నీ వీడియో చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారట.ఎవ్వరైనా ఇలా చేస్తే.. గుణపాఠం తప్పదంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు. కారణం లేకుండా ఎవరినీ డిస్టర్బ్ చేయకండి అంటూ చేస్తే ఇలానే ఉంటుందంటున్నారు. ఈ ఫన్నీ వీడియోని నెటిజన్లు బాగా ఇష్టపడుతున్నారు. ఈ వీడియోను ‘నిర్మలా వైష్ణవ్’ అనే యూజర్ ఫేస్బుక్లో షేర్ చేయగా.. ఇప్పటి వరకు 70 లక్షల మందికి పైగా దీనిని వీక్షించారు. అదేవిధంగా ఈ వీడియోను లైక్ చేయడంతోపాటూ అందరూ కూడా కామెంట్లు చేస్తున్నారు.