ఇక కొత్త కారు కొన్నసంతోషం కొన్ని క్షణాలు కూడా లేక పోతే ఎలా ఉంటుంది.?ఎన్నో లక్షల రూపాయలు పెట్టి కొన్ని కారు కనీసం రోడ్డుపైకి కూడా రాకముందే డ్యామేజ్ అయితే ఆ బాధను భరించడం చాలా కష్టంగా ఉంటుంది.ఇక తాజాగా ఇలాంటి సంఘటనే బెంగళూరు సిటీలో జరిగింది. బెంగళూరు సిటీలోని మహీంద్ర షోరూమ్‌లో ఓ కస్టమర్ థార్ కారును కొనుగోలు చేశాడు. డెలివరీ రోజున కారును టెస్ట్ డ్రైవ్ చేయాలని అతను కారు ఇంజన్ స్టార్ట్ చేశాడు. ఇక అంతకు ముందు కారు నడిపిన అనుభం అతనికి లేదేమో కారులో ఏమైనా ప్రాబ్లమ్ ఉందో తెలియదు కానీ. ఆ కారు ఒక్కసారిగా దూసుకెళ్లింది.ఇక ఏకంగా షోరూమ్ అద్దాలను బద్దలు కొట్టుకొని మరి షోరూమ్ బాల్కనీలోకి వెళ్లింది. ఆ కార్ షోరూమ్ ముందు భాగంలోని రెయిలింగ్స్‌ను ఢీకొట్టింది. అయితే ఇందులో ఆనందించాల్సిన ఆంశం ఒక్కటే..ఆ కారు అక్కడితోనే ఆగిపోవడం. ఇక దీంతో వెంటనే రంగంలోకి దిగిన షోరూమ్ మెంబెర్స్ వెంటనే ఆ కారును ఎలాగోలా తిరిగి షోరూమ్ లోపలికి పంపించారు. దీంతో అక్కడున్న వారంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు.

ఇక అయితే ఇలాంటి షాకింగ్ సంఘటనలు అనేవి జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఇటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ ఎల్‌బీ నగర్‌లోని టాటా షోరూమ్‌లో ఇలాగే ఓ కొత్త కారు షోరూమ్ మొదటి అంతస్తు నుంచి ఏకంగా దూసుకుంటూ బయటపడింది.ఇక  అప్పట్లో ఈ సంఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌గా మారిన సంగతి కూడా తెలిసిందే. అంతేకాకుండా గతంలో ఓసారి కియా కారు సేమ్ ఇలాగే షోరూమ్ నుంచి బయటకు రాగానే గోడను ఢీకొట్టిన సంగతి తెలిసిందే.ఇక ప్రస్తుతం ఆ మహీంద్రా థార్ కార్ అయితే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ బాగా వైరల్ అవుతుంది.


https://youtu.be/iA0rrvH8dEA

మరింత సమాచారం తెలుసుకోండి: