పెళ్ళి అనేది చాలా సంప్రదాయమైన అంశం.. ఒకరితో ఒకసారి మాత్రమే చేసుకోవాలని, వారితోనే జీవితాంతం కలిసి వుండాలని అంటారు. ఇది మన బామ్మల కాలంలో మాట ఇప్పుడు మాత్రం ట్రెండ్ మారింది. బోర్ కొడితే విడిపోవడం మళ్ళీ వేరే వాళ్ళను పెళ్ళి చేసుకోవడం సహజం.అందుకే ఒకరికి భార్యా గా ఒకరు ఉన్నా కూడా వేరే విధంగా చాలా మందిని మెయింటైన్ చెస్తున్నారు శృంగార పురుషులు..


ఇప్పుడు ఒక వార్త వింటే నోరు వేళ్ళబెట్టాల్సిందే.. ఒక వ్యక్తి ఏకంగా 8 మంది భార్యాలను పెళ్ళి చేసుకున్నాడు..వామ్మో ఒకరికి దిక్కు లేదు ఏకంగా ఎనిమిది మందిని ఎలా చేసుకున్నాడు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతమందిని పొషించాలంటే అతను పెద్ద ధనవంతుడు అయ్యి వుంటాడు అనుకోవడం పొరపాటు. అతను రొజువారి కూలి.. ఆ డబ్బులతో వారందరిని పోషిస్తున్నారు. అది కూడా భార్యలను ఒప్పిస్తూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ ప్రస్తుతం ఎంతో అన్యోన్యంగా అందరితో కలిసి ఉంటున్నాడు.. ఇది నిజంగా గ్రేట్ అనే చెప్పాలి.


థాయ్‌లాండ్‌కు చెందిన ఓంగ్ డామ్ సోరోట్ వైవాహిక జీవితం అలా నడుస్తోంది. అతను చిన్న షాపు పెట్టాడు..టాటూలను వేసే షాప్ పెట్టుకుని ఉన్నాడు.టాటూ ఆర్టిస్ట్‌గా ఉన్న ఇతను మొదటి భార్యను స్నేహితుడి పెళ్ళిలో చూసి ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. ఆ తరువాత రెండవ భార్యను మార్కెట్లో చూసి, మూడో భార్య హాస్పిటల్ నర్సు.. అలా ఒక్కొక్కరిని ఒక్కో విధంగా చూసుకొని నచ్చి పెళ్ళి చేసుకున్నాడు. అయితే ఒకరికి చెప్పి మరొకరిని పెళ్ళి చేసుకున్నాడు.కాగా,ఇంట్లో మొత్తం నాలుగు బెడ్ రూంలు ఉన్నాయట.


ఒక్కో బెడ్ రూంలో ఇద్దరు చొప్పున భార్యలు ఉంటారట. ఇలా 8 మందిని పోషిస్తున్నాడట. ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు తనకు రాలేదని.. అందరూ అక్కచెల్లెళ్ళ లాగా కలిసి ఉన్నారని అతను చెప్పాడు. వారందరికీ పిల్లలు పుట్టక పోవడంతో బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈరోజుల్లో ఎనిమిది మందిని పెళ్ళి చేసుకోవడం గ్రేట్ అంటూ నెటిజన్లు కామెంట్లు చెస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: