ప్రపంచం మొత్తం ఈరోజు ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటారు.. ప్రేమికులు తమ ప్రేమను మరింత గా పెంచుకునేందుకు కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు. అయితే కొన్ని మాత్రం జనాల ను ఆకట్టుకుంటూ వస్తున్నాయి. మరి కొన్ని షాక్ ఇస్తున్నాయి. అందులో ఒకటి ఇప్పుడు ఆష్చర్యాని కి గురి చేసింది. అద్దెకు కారు, బస్సు ఇస్తున్నట్లు బాయ్ ఫ్రెండ్ అంటూ ఓ వ్యక్తి ఒక బోర్డు పట్టుకొని నిలుచున్నాడు. అది చూసిన వారంతా కూడా నవ్వుతూ అతణ్ణి హేళన చేశారు. ఇప్పుడు అతనే సోషల్ మీడియా లో స్టార్ అయ్యారు.


వివరాల్లొకి వెళితే.. బిహార్ లో ఈ ఘటన వెలుగు చూసింది. దర్భంగాకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి ప్రియాన్షు మాత్రం 'అద్దెకు బాయ్ఫ్రెండ్' అనే ప్లకార్డు తో వీధి వీధి తిరుగుతూ ప్రదర్శనలు చేస్తున్నాడు. ఈ విధంగా అతను ప్రేమ సందెషాలను అందిస్తున్నారు.. ఇలా రద్దీగా వున్న రోడ్ల పై ఫ్లెక్సీ పట్టుకుని తిరుగుథూ అందరినీ ఆకర్షించాడు. నగరం లోని రాజ్కోట్, చర్చి, దర్భంగా టవర్, బిగ్బజార్ లాంటి రద్దీ ప్రాంతాల్లో ఈ ప్లకార్డు ను ప్రదర్శిస్తున్నాడు ప్రియాన్షు..


ఇంజనీరింగ్ చదువు తున్న అతను గతం లో క్రిష్మస్ రోజున కూడా ఇలానే బోర్డు పట్టుకొని ఫ్రీ హగ్ అంటూ ప్రచారం చేశాడు. అందుకు చాలా మంది నుంచి మంచి స్పందన తో పాటు ప్రశంసలు కూడా అందాయి. మేము ఒంటరిగా ఉన్నామని భావించే వారి ముఖం లో చిరునవ్వు చూడాలని ఇలా ప్లకార్డుతో ప్రదర్శన చేస్తున్నాన ని ప్రముఖ చానెల్ ఇంటర్వ్యూ లో చెప్పారు..ప్రేమ అంటూ ఇలాంటి వాటి గురించి ఆలొచించి టైం వెస్ట్ చేసుకోకుండా దేశాన్ని అభివృద్ధి కోసం పాటు పడాలని అతను సూచించాడు..మొత్తానికి అతని ఆలోచన అందరినీ ఆకర్షించింది.. అలా సోషల్‌ మీడియా లో వైరల్ అవుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: