మనకు ఈ దేవుడు ఇచ్చిన ఈ చిన్న జీవితాన్ని సరదాగా బ్రతకాలని అనుకుంటారు. అయితే అందరికీ ఈ అదృష్టం ఉండకపోవచ్చు. పుట్టుకతో కొందరు ధనవంతులు అవుతారు. మరి కొందరు ఏదో ఒకటి చేస్తూ ధనవంతుడిగా మారాలని అనుకుంటారు. కానీ ఎప్పుడు ఏ అదృష్టం ఎవరిని ఎలా వరిస్తుంది అన్నది ఊహించడం చాలా కష్టం. కొందరు ఎంత శ్రమ పడినా కొద్దీ పాటి డబ్బుతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అయితే ఒక చిన్న వ్యాపారి అదృష్టం తనకు కలిసి వచ్చి రాత్రికి రాత్రి ఎలా ధనవంతుడిగా మారిపోయాడో ఇప్పుడు చూద్దాం.

మధ్యప్రదేశ్ రాష్ట్రము పన్నా జిల్లాలో సుశీల్ శుక్లా అనే వ్యక్తి ఉన్నాడు. ఇతను ఒక చిన్న ఇటుక బట్టీని నిర్వహిస్తూ ఉండేవాడు. అయితే ఇటుక బట్టీ కోసం మట్టి అవసరం అవుతుంది. ఈ మట్టిని సుశీల్ శుక్లా కళ్యాణ్ పూర్ నుండి తీసుకుం వచ్చి వ్యాపారం సాగిస్తూ ఉండేవాడు. అయితే గతంలో తెలుస్తున సమాచారం ప్రకారం కళ్యాణ్ పూర్ ప్రాంతంలో వజ్రాలు ఉండేవట, 20 సంవత్సరాల క్రిందట అక్కడ వజ్రాల కోసం ఎందరో వెతికినా ఉపయోగం లేకుండా పోయిందట. అయితే అక్కడ నుండి మట్టి తీసుకురావడం అలా అలవాటు అయింది. కానీ యధావిధిగా మట్టిని తీసుకు వచ్చిన పని వారు పని జరిగే ప్రదేశము లో మట్టిని పని కోసం సిద్ధం చేస్తుండగా వారి కంటికి ఒక వజ్రం కనిపించింది.

ఈ విషయాన్ని తన యజమాని అయిన సుశీల్ శుక్లా కు తెలిపారు. దీనితో సుశీల్ శుక్లా ఆ వజ్రాన్ని అధికారులకు చూపించగా వారు చెప్పిన మాటలకూ ఆశ్చర్యపోయాడు. ఈ వజ్రం 26.11 క్యారట్ ల బరువు ఉందట. అంతే కాకుండా దీనిని వేలం వేస్తే కోటి 20 లక్షల వరకు అమ్ముడు పోతుందని సదరు అధికారులు శుక్లా కు తెలియచేశారు. ఎలాగు మొత్తం డబ్బు రాదు కాబట్టి, ప్రభుత్వంకు కట్టాల్సిన టాక్స్ లు అన్నీ పోగా కోటి వరకు మిగులుతుందని తెలుస్తోంది. చూడండి ఒక సాధారణ ఇటుక బట్టీ వ్యాపారి అనుకోకుండా అదృష్టం తోడు కావడంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడు అయ్యాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: