శివరాత్రి పర్వదినాన తిరుపతిలో కోలాహలం నెలకొననుంది.. సంగీత నృత్యలు, డోలు సన్నాయి లతా ఈ రోజున తిరుపతిలో సంగీత మహోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు నుంచి మూడు రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు.. ఆ తర్వాత మధ్యాహ్నం 3 నుండి రాత్రి పది గంటల వరకు ఈ సంగీత కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ముందుగా కళాశాల, పాఠశాల విద్యార్థులతో ప్రారంభించి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి శ్రీ నటరాజ స్వామికి పూజలు చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇక ఆ తరువాత మోహన్ కృష్ణ, పవన్ కుమార్ విద్యార్థులతో భక్తి సంగీతలను పాడించానున్నారు. ఆ తరువాత వయోలిన్-మృదంగం వాద్యసంగీతం , వేణువు- వీణ వాద్యసంగీతం, ఇక ఆ తరువాత నాదస్వరం, డోలు వాద్య సంగీతం నిర్వహించనున్నారు. ఇక అదే విధంగా అధ్యాపకులు శ్రీమతి పూర్ణ వైద్యనాథన్ శ్రీ అంజనేయం వయోలిన్ ని ప్రదర్శించనున్నారు. శ్రీ బి రఘురాం మృదంగ వాద్య సమ్మేళనం ఆకట్టుకుంటుంది. ఇక వీటితో పాటుగా మరికొంతమంది భరతనాట్యం కూడా ప్రదర్శించనున్నారు. అందులో ముఖ్యంగా నాదస్వర వాద్యం. వంటి కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకోనున్నాయి. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సుధాకర్, ఇతర అధ్యాపకులు మరియు విద్యార్థులు కూడా పాల్గొన బోతున్నారు.


భక్తులు మహాదేవుడిని ప్రతిరోజు స్మరిస్తూ నిత్య శివరాత్రి జరుపుకోనున్నారు. ఈరోజు ఆద్యంత రహితుడిని ఎన్నిసార్లు స్మరించినా తనివి తీరదంట. పక్షానికి, మాసానికి, సంవత్సరానికి ఒకసారి మాత్రమే శివయ్య పేరుతో ఇలాంటి అభిషేకం చేస్తానని తెలియజేశారు. వీటన్నిటిలో చాలా విశిష్టమైనది మాఘ బహుళ చతుర్దశి. ఇక రేపటి రోజున ఇది ఉంటుంది అని తెలియజేశారు. ఇక మహాశివరాత్రి పరమశివునికి ఎంతో ఇష్టమైన రోజు గా మన ధర్మ శాస్త్రాలు తెలియజేస్తున్నాయి.. మహాశివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ ఉపవాసం తో గడపడం, అభిషేకం చేయడం వంటివి చేయడం శ్రేయస్కరమట.

మరింత సమాచారం తెలుసుకోండి: