అయితే ఈ విద్యార్థి మృతి పై ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక సహాయాన్ని ప్రకటించారు. మృతి చెందిన రంజిత్ కుటుంబానికి.. రూ.5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించడం జరిగింది. ఇక ఆ ప్రాంత మంత్రుల ద్వారా ఈ రోజున విద్యార్థి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు గా సమాచారం. ఇక అక్కడ జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ఈ విషయాన్ని తెలియజేసింది. దీంతో ఆ విద్యార్థి కుటుంబానికి కాస్త ఊరట లభించింది అని చెప్పవచ్చు. ఈ విషయంపై జగన్ తీవ్ర విచారణ వ్యక్తం చేస్తున్నారు.
మహాత్మా గాంధీ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో గురువారం రోజున రాత్రి పాముకాటుతో విద్యార్థి మృతి చెందిన సంగతి అందరికీ తెలిసిందే. భోజనం చేసిన తరువాత విద్యార్థులు అందరూ నిద్రిస్తున్న గదిలోకి అర్ధరాత్రి సమయంలో పాము ప్రవేశించడం జరిగిందట. కొమరాడ మండలం ఈ పేటకు చెందిన రంజిత్, వంగపండు నవీన్, ఈదుబల్లి వంశీ లను కాటు వేయడం జరిగింది.. ఇక్కడ దగ్గరలో ఉండే హాస్పటల్ కి తరలించే మార్గమధ్యంలో రంజిత్ మరణించడం జరిగింది. ఇక మిగిలిన ఇద్దరు విద్యార్థులను మెరుగైన వైద్యం కోసం వేరొక హాస్పిటల్ కి తరలించారు