ఎక్కడైనా ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ జాయింట్ వీల్ తప్పనిసరిగా ఉంటుంది. అయితే జాయింట్ వీల్ కనిపించింది అంటే చాలు ప్రతి ఒక్కరికి ఒక్కసారి ఎక్కి తిరిగి రావాలని అనిపిస్తోంది.. అయితే ఇలా అనిపించడం మాత్రం అప్పుడు వరకు అసలు జాయింట్ వీల్ ఎక్కని వారికి అనిపిస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే ఒకసారి ఎక్కిన తర్వాత మళ్లీ ఎక్కడానికి మాత్రం చాలామంది సాహసం చేయరు. ఎందుకంటే ఎంతోమంది జాయిన్ వీల్ ఎక్కెటప్పుడు ఎంతో ధైర్యంగా ఉన్నప్పటికీ అది గిరగిరా తిరుగుతూ ఉంటే  మాత్రం తెగ భయపడిపోతుంటారు.



 ఇలాంటి అనుభవం కేవలం ఒక్కరికి మాత్రమే కాదు దాదాపు అందరికీ జరిగి ఉంటుంది. మొదటిసారి జాయింట్ వీల్ ఎక్కినప్పుడు  మీరు కూడా ఎంతగానో భయపడే ఉంటారు. గత కొన్ని సినిమాలలో ఇలాంటి సన్నివేశాలు ఎంతో మంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి కూడా. ఇప్పుడు ఇలాంటి ఒక వీడియో నే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ప్రస్తుతం సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న జాయింట్ వీల్ అందరినీ తెగ నవ్విస్తుంది అని చెప్పాలి. ఇక్కడ ఓ బాలుడు జాయింట్ వీల్  ఎక్కి భయం తో ఊగిపోయాడు



 జాయింట్ వీల్ ఎక్కడానికి ముందు ఒక్కసారి నన్ను ఎక్కించు నాన్న అంటూ ఎంతగానో బ్రతిమిలాడాడు. దీంతో తండ్రి అతని జాయింట్ వీల్ ఎక్కించాడు. అతని సంతోషానికి అవధులు లేవు అని చెప్పాలి. అంతా బాగానే ఉంది కానీ అంతలోనే జాయింట్ వీల్ చిన్నగా కదలడం ప్రారంభించింది. సరికొత్తగా ఫీల్ అయిన సదరు బుడ్డోడు చప్పట్లు కొట్టి మరి ఎంజాయ్ చేశాడు. ఆ సంతోషం ఎక్కువసేపు ఉండలేదు ఇంకాస్త వేగంగా తిరగడం మొదలైంది. దీంతో అప్పటివరకు సంతోషంగా ఉన్న బాలుడు అరవడం మొదలు పెట్టాడు.దేవుళ్ళ పేర్లు తలుచుకోవడమే కాదు ఆపండి అంటూ అరుస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: