ఇటీవలి కాలంలో ఎంతో మంది యువతులు నడిరోడ్డు మీద రెచ్చిపోతూ దారుణంగా యువకులపై దాడులకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే. చేసిన చిన్న తప్పు కె ఏకంగా రోడ్డుమీద హంగామా సృష్టిస్తున్నారు. గతంలో ఇలాంటి తరహా వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయాయి. ఇటీవల ఉత్తర ప్రదేశ్ లో కూడా ఇలాంటి ఒక షాకింగ్ వీడియో వెలుగులోకి వచ్చింది.


 అయితే రోడ్డుపై వెళ్తున్న సమయంలో సాధారణంగా ఎవరైనా ముందు ఉన్న వాళ్ళు సడన్ బ్రేక్ వేసినప్పుడు వెనకాల ఉన్న వాహనం కొన్నిసార్లు తగలడం లాంటివి జరుగుతూ ఉంటుంది. ఇలా చిన్నగా వాహనాలు తగలడం రోడ్డుపై సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది. ఇలా తగిలినప్పుడు ఒకరికి ఒకరు సారీ చెప్పుకుంటూ సర్దుకుపోతూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఓ అమ్మాయి రోడ్డుపైన హై ఓల్టేజ్ డ్రామా సృష్టించింది. ఒక అమ్మాయి స్కూటీపై ఎక్కడికో బయలుదేరింది.


 ఇదే సమయంలో అటు వైపు వస్తున్న ఒక అబ్బాయి బైక్ అనుకోకుండా అమ్మాయి స్కూటీ ని తాకుతోంది. ఇక అలా తాకిన సమయంలో సారీ మేడం చూసుకోలేదు అంటూ ఓ యువకుడు చెప్పాడు. కానీ సదరు యువతి మాత్రం ఆగ్రహం పట్టలేక పోయింది. ఏకంగా రోడ్డుమీద హంగామా సృష్టించింది. సదరు యువకుడు దగ్గరికి వెళ్లి జేబులో చేయి పెట్టి మరి మొబైల్ లాక్కొని నేలకేసి కొట్టండి. దీంతో సెల్ఫోన్ ముక్కలు ముక్కలు గా మారిపోయింది. ఘటనకు సంబంధించిన వీడియో  సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోవడం తో అందరూ షాక్ అవుతున్నారు. 
అయితే ఈ వీడియో పోలీసుల వరకు చేరిందా చేరలేదా అన్నది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిపోయింది. అయితే గతంలో కూడా ఒక యువతి నడిరోడ్డు మీద క్యాబ్ డ్రైవర్ ని చితకబాదిన  వీడియో ఒకటి వైరల్ గా మారింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: