ప్రపంచంలో ఎన్నో వింతలు జనాల ముందుకు వస్తాయి.కొన్ని వింతలకు జనాలు ఆశ్చర్యంగా చూస్తె, మరి కొంతమంది మాత్రం ఔరా అని షాక్ అవుతూన్నారు. ఈ మధ్య కాలంలో చాలా వింత ఘటనలు వెలుగులొకి వచ్చాయి. వేప చెట్టుకు పాలు కారిన వింత వెలుగు చూసింది.  ఒక దూడకు రెండు తలకు.. అలాగే ఒక చెట్టుకు మరొక కాయలు రావడం ఇలా ఒకటేమిటి ఎన్నో వింతలు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేశాయి. వాటి గురించి సోషల్ మీడియాలో ప్రచారం కూడా ఊపందుకున్నాయి..


అందుకు సంబంధించిన ఫోటోలు,వీడియోలు ఇప్పటికీ సోషల్ మీడియాలో హల్ చేస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఇప్పుడు మరో వింత ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కోడికి వింత ఆకారంలో కోడి గుడ్డు బయటకు వచ్చింది. ఆ గుడ్డు మెలి తిరిగి ఉండటం విశేషం.. అది చూడటానికి వింత్గగా అనిపించడం గమనార్హం.. ఇది నిజంగా జరుగుందా అనే సందేహం రావడం సహజం. అంతగా ఆ గుడ్డు అందరి నచ్చుతుంది.


విషయాన్ని కొస్తే... ఈ వింత కోడి గుడ్డు ఆంధ్రప్రదేశ్‌లో వెలుగులోకి వచ్చింది.. ఈ గుడ్డు చాలా చిన్నగా మెలి తిరిగి ఉంది. రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో వెలుగు చూసింది. జిల్లా లోని ఓ మండలంలోని రాజుపేట కాలనీలో ఓ కోడు గుడ్డు వింత ఆకారంలో ఆకట్టుకుంది. గ్రామానికి చెందిన ముంజపు సత్యనారాయణకు చెందిన కోడిపెట్ట గత రోజు మధ్యాహ్నం ఈ గుడ్డు పెట్టింది..వంపు తిరిగిన ఆకారంలో ఉండటం విశేషం.. అయితే ముందు గంప కింద ఉన్న దానిని ఏదో ఒక వస్తువు అని కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు.ఆ తరువాత బాగా   పరిశీలించగా అది తమ కోడి పెట్టిన గుడ్డుగా గుర్తించి ఆశ్చర్యపోయారు. ఇలా వంపు తిరిగి ఉండటంతో ఆకట్టుకుంటోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: