ఇక అంతే కాకుండా కేసీఆర్ 95% స్థానిక కోట తోనే ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలియజేశారు. ఇందులో ఖాళీగా ఉన్న పోస్టుల్లో హోంశాఖ లో 18,334 పోస్ట్లు.. సెకండరీ ఎడ్యుకేషన్ 13,086 పోస్ట్లు.. ఉన్నత విద్యా శాఖ లో..7,878 పోస్ట్లు, వైద్య శాఖలో 12,755 పోస్ట్లు, రెవెన్యూ శాఖలో 3,560 పోస్ట్లు, సంక్షేమ శాఖలో 4,311 పోస్ట్లు, నీటిపారుదల శాఖలో, 2,692 పోస్ట్లు, ఎస్సీ సంక్షేమ శాఖ లో 2,879 పోస్టులు. ట్రైబల్ వెల్ఫేర్ లో 2,399 పోస్ట్లు, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ 1,455 పోస్టులు, మైనారిటీ వెల్ఫేర్ 1,825 పోస్ట్లు, ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ 1,598 పోస్ట్లు. అగ్రికల్చర్ విభాగంలో 801 పోస్టులు, ఫైనాన్స్ 1146 పోస్టులు, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ కింద 859 పోస్ట్లు, ఇక మిగతా వాటిలో కూడా కొన్ని పోస్ట్ లు కలవు.
వయోపరిమితి:
అభ్యర్థులు ఉద్యోగాల కోసం ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు కాబట్టి అందుకోసం కేసీఆర్ ఉద్యోగు ల గరిష్ట వయోపరిమితిని పది సంవత్సరాలపాటు పెంచినట్లు గా తెలుస్తోంది.. అందులో ముఖ్యంగా ఓసి అభ్యర్థులకు 44 సంవత్సరాలు.. మిగిలిన ఎస్సీ, ఎస్టి బీసీ అభ్యర్థులకు 49 సంవత్సరాలు గరిష్ట వయో పరిమితి ఉంటుంది. ఇక అంతే కాకుండా దివ్యాంగులకు మాత్రం 54 సంవత్సరాల వరకు పెంచినట్లు గా తెలుస్తోంది. మొత్తంమీద తెలంగాణలో ఉద్యోగుల జాతర అని చెప్పవచ్చు.