ఇక దీని ప్రకారం చూసుకున్నట్లుయితే గడిచిన 24 గంటలలో 8 లక్షలకుపైగా కరోనా కేసులు నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. అందులో కేవలం 3,614 మందికి మాత్రమే కరోనా సోకినట్లుగా తెలుస్తోంది. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4.29 కోట్లకు చేరిపోయింది. కేవలం నిన్నటి రోజున మాత్రమే 89 మంది మహమ్మారి బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఇక వీటన్నిటినీ కలుపుకొని ఇప్పటివరకు 5.15 లక్షల మంది మరణించినట్లుగా అధికారులు తెలియజేశారు.
గడిచిన 24 గంటలలో 5,185 మందికి కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాను జయించిన వారి సంఖ్య..4.24 కోట్లకు చేరిపోయింది. ప్రస్తుతం దేశంలో కరోనా రికవరీ రేటు శాతం 99.71 చేరినట్లుగా తెలుస్తోంది.. ఇక రోజువారి సగటు రేటు కింద..0.44 శాతం మంది మాత్రమే ఉన్నారని వైద్య ఆరోగ్య శాఖ వారు పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ గా ఉన్న కేసుల సంఖ్య..40,559 వరకు ఉన్నట్లుగా తెలియజేశారు. కరుణ కేసులు అదుపులోనే ఉన్నప్పటికీ వ్యాక్సిన్ ప్రయత్నం కూడా చాలా చురుకుగా కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటలలో 18,18,511 మందికి టీకాలు వేసినట్లుగా సమాచారం. దీంతో ఇప్పటి వరకు 179 కోట్లకు పైగా డోర్లు పంపిణీ చేసినట్లుగా వైద్య శాఖ వారు తెలియజేస్తున్నారు.