ఇక ఈ సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు తెగ చక్కర్లు కొడుతూ బాగా వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని వీడియోలు మాత్రం చాలా ఫన్నీగా ఉంటే మరికొన్ని వీడియోలు మాత్రం చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఇలా సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అయ్యే వాటిల్లో జంతువులకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా ఉంటాయి.ఇక తాజాగా.. నెట్టింట ఓ కుక్కకి సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కుక్క బూట్లు వేసుకోని పరుగులు తీస్తుంది. దీనిని చూసి నెటిజన్లు దెబ్బకు నోరెళ్లబెడుతున్నారు. సాధారణంగా కుక్కలు విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తాయి. అయితే.. కొన్ని సార్లు మాత్రం నమ్మినవారి కోసం ప్రాణాలను కూడా ఇచ్చేందుకు అవి వెనకాడవు. తాజాగా.. ఈ కుక్కకి సంబంధించిన ఓ వీడియో అయితే నెట్టింట నవ్వులు పూయిస్తుంది.వైరల్ వీడియోలో ఓ కుక్క బూట్లు వేసుకుని నడుచుకుంటూ వస్తుండటాన్ని మనం చూడవచ్చు.


కుక్క తన నాలుగు పాదాలకు కూడా బూట్లని ధరించి ర్యాంప్ వాక్ చేసేలా అక్కడ పరుగులు తీస్తుంటుంది. ఇక ఈ కుక్క బూట్లు ధరించడం వల్ల చాలా అసౌకర్యంగా కనిపిస్తుంది. ఇక ఆ వీడియోలో దాని కేర్‌టేకర్ వాయిస్ కూడా మనకు వినిపిస్తోంది. ఇక తెలుస్తున్న సమాచారం ప్రకారం, ఈ వీడియో అమెరికాలోని నార్త్ డకోటాలోని సూపర్ స్టోర్‌లో షూట్ చేశారట. ఇక మోంటానా అనే కుక్కకు దాని యజమాని బూట్లు వేసి.. అది నడుస్తుంటే..దాన్ని చూసి తెగ మురిసిపోయాడు.ఇక ఈ వీడియోను ViralHog అనే ఛానెల్ YouTubeలో షేర్ చేసింది. ఈ వీడియోని 40 వేలకు పైగా మంది చూసి దానిపై పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంది.. బూట్లల్లో ఈ కుక్క సూపర్బ్‌గా ఉందని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా.. ఇంకా మరికొందరు మాత్రం ఇలా వాటిని హింసించవద్దంటూ సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: