అతివేగం కిక్ ఇస్తుంది కానీ ప్రాణాలను తీసేస్తోంది వాహనదారులు అందరికీ అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ పోలీసులు అక్కడ అక్కడ ఇలాంటి బోర్డులను పెడుతూ ఉంటారు. ఇలాంటివి చూసిన తర్వాత నిజమే అతివేగం ప్రమాదకరం అని అనుకుంటూ ఉంటారు వాహనదారులు. ఇలా అనుకునే వారే చివరికి  అతివేగంగా వెళ్తూ  రోడ్డు ప్రమాదాలకు కారణం అవుతూ ఉంటారు. రోడ్డు నిబంధనలు పాటించకుండా అతివేగం కారణంగా చివరికి ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది అనే చెప్పాలి..


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని తెలుస్తోంది. ఇక అతివేగం ఎంత ప్రమాదకరమో చెప్పే ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఇటీవలే వరంగల్లోని శివ నగర్ లో చోటుచేసుకున్న ఒక రోడ్డు ప్రమాదంలో అందరినీ అవాక్కయ్యేలా చేస్తోంది. ఇక ఎప్పటి లాగానే రాత్రి సమయంలో అన్ని వాహనాలు అటూ ఇటూ వెళ్తున్నాయి. అంతలోనే ఓవర్ స్పీడ్ తో ఒకసారిగా రయ్యి మంటూ దూసుకొచ్చింది ఒక కార్. అయితే ఎడమ వైపు నుంచి మరొక కార్ మెల్లగా మెయిన్ రోడ్డు వైపు ఎక్కుతోంది. ఇక ఒక్కసారిగా కారు అడ్డుపడటంతో వేగంగా కారు నడుపుతున్న డ్రైవర్ తడబడ్డాడు.


 అప్పటికి అతివేగంతో ఉన్న కారు ని కంట్రోల్ చేయలేకపోయాడు. దీంతో స్టీరింగ్ కంట్రోల్ తప్పింది. ఇక ఎడమవైపు నుంచి రోడ్డుమీదికి వస్తున్న కారును తప్పించే క్రమంలో అది వేగం కారణంగా కారు పల్టీలు కొట్టింది. ఎదురుగా ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ ఢీకొట్టింది.. ఇందులో ఉన్న ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి అనేది తెలుస్తుంది. ఇక స్పీడ్ కంట్రోల్ కాకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిర్ధారించారు. ఇక ఇది చూసిన వారు అతి వేగం కారణంగా ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో అన్నదానికి ఈ ఘటన నిదర్శనంగా మారిపోయింది అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: