వివరాల్లొకి వెళితే.. ఈ లెటర్ ఇంగ్లాండ్ లో వెలుగు చూసింది.బాయ్ ఫ్రెండ్స్ కోసం వెతుకుతున్న ఇద్దరు యువతులు 56 ఏళ్ల క్రితం రాసిన వ్రాతపూర్వక సందేశం దొరికింది.ఇంగ్లాండ్‌లోని నార్త్ లింకన్‌షైర్‌లో స్కన్‌థార్ప్ లిట్టర్ పికర్స్ గ్రూప్ వ్యర్థాలు, పాత వస్తువులను తీస్తుంది..ఇటీవల మరోసారి వ్యర్థాలను తొలగించే పని చేసింది.దాన్ని ప్రత్యేకంగా భావించిన సిబ్బంది బాటిల్‌ను పక్కకు పెట్టారు.. ఆ తర్వాత దానిని ఓపెన్ చేసి చూసి షాక్ అయ్యారు.అందులో ఒక లెటర్ వుంది..బాయ్ ఫ్రెండ్ కోసం యువతులు వెతుకుతున్న విషాయాన్ని అందులో వివరించారు..
గాజు సీసాలో దొరికిన 56 ఏళ్ల లేఖను ఇద్దరు యువతులు ఆగస్టు 9, 1966న రాశారు. అందులో వారు తమ బాయ్‌ఫ్రెండ్స్ కోసం వెతుకుతున్నారు. అమ్మాయిల పేర్లు జెన్నిఫర్ కోల్‌మన్, జానెట్ బ్లాంకి.. ఇద్దరు లెటర్ లో వారి రూపాన్ని వివరించారు.. వారికి 16 ఏళ్ళు ఉన్నాయని వాళ్ళు వివరించారు..జెన్నిఫర్ కోల్‌మన్ అనే మహిళా ఆస్త్రెలియా లో వున్నట్లు తెలిసింది.. మరో మహిళ విషయం మాత్రం ఎవరికీ తెలియలేదు..56 ఏళ్ల క్రితం రాసిన ఈ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది...