ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో భాగంగా ప్రతి మ్యాచ్ ఎంతో ఉత్కంఠభరితంగా సాగుతూ హాట్ టాపిక్ గా మారిపోతుందో.. అటు అంపైర్లు చేస్తున్న తప్పిదాలు కూడా సోషల్ మీడియాలో అంతే హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి.  ఇక అంపైర్లు ఎంతో అప్రమత్తంగా ఉండి బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సింది పోయి ఎన్నో పొరపాట్లు చేస్తూ చివరికి కొన్ని జట్ల ఓటములకు ఇండైరెక్టుగా కారణం అవుతూ ఉండడం పై ఐపీఎల్ అభిమానులు అందరూ కూడా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలు తప్పుడు నిర్ణయాల కారణంగా అంపైర్ల ను  సోషల్ మీడియాలో తిట్టిపోశారు ఆయా జట్ల అభిమానులు.


 ఇటీవలే ఐపీఎల్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఇలాంటిదే జరిగింది అన్న విషయం తెలిసిందే. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు 222 పరుగులు చేసింది. ఇక భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్ జట్టు మొదట తడబడింది.  కాని చివర్లో ఢిల్లీ బ్యాట్స్మెన్ పావెల్ దూకుడైన ఆట చూస్తే ఇక ఢిల్లీకి విజయం వరిస్తుందేమో అన్న విధంగా మారింది  దీంతో ఉత్కంఠ  భరితంగా మారిన మ్యాచ్లో ఒక వివాదం చోటు చేసుకుంది. అయితే చివరి ఓవర్ లో మూడో బంతిని రాజస్థాన్ బౌలర్ మెక్కాయ్  వేశాడు.


 ఈ క్రమంలోనే ఆ బంతిని పావెల్ సిక్సర్ గా మలిచాడు. కానీ ఆ బంతి పావెల్ నడుము కంటే ఇక వికెట్ల పైనుంచి వెళుతున్నట్లుగా కనిపిస్తోంది. వాస్తవంగా అయితే అంపైర్లు దానిని నో బాల్ గా ప్రకటించాలీ. కానీ అంపైర్లు మాత్రం ప్రకటించలేదు. దీంతో డగౌట్ లో ఉన్న కెప్టెన్ రిషబ్ పంత్, కోచింగ్ సిబ్బంది గందరగోళం సృష్టించారు. అంపైర్ నిర్ణయం పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ క్రీజులో ఉన్న ఆటగాళ్లు రిటైర్డ్ ఔట్ గా డగౌట్ కి రావాలి అంటూ కెప్టెన్ రిషబ్ పంత్ సైగ చేశాడు. ఇలా చివరి ఓవర్లో నోబల్ విషయంలో హైడ్రామా నడిచిం.ది మరి ఈ వీడియో చూసిన తర్వాత అభిప్రాయం ఏంటో చెప్పండి.

మరింత సమాచారం తెలుసుకోండి: