ప్రజలను రక్షించడం పోలీసుల భాధ్యత.. కష్టం అని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన వారి కన్నీరు ను తుడుస్తున్నారు.అలాంటి పోలీసులు ఆకలితో ఉన్న ప్రజల ఆకలిని కూడా తీరుస్తున్నారు. కరోనా సమయం లో ఎందరో పేద ప్రజల ఆకలిని తీర్చారు. ఇప్పటికీ చాలా మంది పోలిసులు ప్రజలను ఆదుకోవటానికి ముందుకు వస్తున్నారు.ఇప్పుడు మరో పోలీసు అధికారి ఆకలి తో ఉన్న మహిళ ఆకలిని తీర్చాడు. ఇప్పుడు నెట్టింట చక్కర్లు కోడుతుంది. ఒక్కసారిగా అతను హీరో అయ్యాడు.విషయాన్నికొస్తే.. హైదరాబాద్ మహానగరంలో చాలా మంది పేద ప్రజలు వున్నారు.


ఒక్కపూట భోజనం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు.. కొంత మంది అయితే బిక్షాటన చేస్తూ రోడ్డు పక్కనే నివసిస్తూ ఉంటారు..రోడ్డు పక్కన అన్నం దొరక్క ఆకలి తో అలమటించే వారు చాలా మంది ఉంటారు.. అయితే మన కళ్ళ ముందే ఆకలితో అలమటిస్తున్న.. వారి ఆకలి కేకలు వినిపిస్తున్నా ఎవ్వరు పట్టించుకోరు. హైదరాబాద్ నడి బొడ్డున చాలా మంది పేద ప్రజలు ఉన్నారు.ఎంతగా అభివ్రుద్ది చెందిందొ.. అంతకు మించి పక్క వారి గురించి పట్టించుకునే తీరిక కూడా ఉండదు.. ఎవ్వడు ఏం చేసిన అడిగేవారు కానీ అడ్డుకునే వారు కానీ ఎవ్వరు ఉండరు.


మరి ఇలా ఆకలితో అలమటించే వారికీ బుక్కెడు అన్నం పెట్టే వారిలో ఈ పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు.. ఈ పోలీస్ సిబ్బంది హైదరాబాద్ బోరబండ బస్సు స్టాప్ దగ్గర ఆకలితో అలమటించే కుటుంబాని కి అన్నం పెట్టి పెద్ద మనసు ను ఛాటుకున్నాడు..ఎస్ ఆర్ నగర్ పెట్రోలింగ్ సిబ్బంది ఆకలితో ఉన్న బిక్షాటన చేసే కుటుంబానికి ఆకలిని తీర్చారు.అతను చేస్తున్న పనికి చాలా మంది అభినందించారు.. అతనికి సంభందించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.. మీరు ఒకసారి ఆ వీడియోను చూసి ఒక లుక్ వేసుకోండి..



మరింత సమాచారం తెలుసుకోండి: