ప్రకృతిలో ఎన్నో రకాల వింతలు జరుగుతున్నాయి.. అందులో కొన్ని జనాలను ఆష్చర్యానికి గురి చేస్తున్నాయి.మరి కొన్ని మాత్రం జనాలను ఆలోచన లో పడేస్తున్నాయి.అలాంటి వాటిలో ఎక్కువగా జంతువులకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వస్తున్నాయి. అందుకు సంబంధించి న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి. ప్రకృతి లో జరిగే కొన్నింటినీ చూస్తుంటే ముచ్చట అలాంటి వాటిలో ఒకటి బంగారపు వర్ణం తాబేలు.. ఏంటి గోల్డెన్ కలర్ లో కూడా ఉంటాయా? అనే ప్రశ్నలు రావడం సహజం.. కానీ మీరు విన్నది అక్షరాల నిజం. అలాంటి కలర్ లో కూడా తాబేల్లు ఉన్నాయి..


తాబేళ్లన్నీ దాదాపు నలుపు, బూడిద వర్ణంలో ఉంటే ఇది మాత్రం పసుపు పచ్చ రంగులో మెరిసిపోతోంది.. ఒడిశా లోని బాలాసోర్ జిల్లా సిములియా గ్రామం లోని ఓ చెరువులో ఈ అరుదైన తాబేలును గుర్తించారు. అక్కడి గ్రామస్థులు దానిని రక్షించి నీటి టబ్‌లో వేశారు. ఆ తాబేలును గ్రామానికి చెందిన ఒక యువకుడు గుర్తించాడు. గ్రామంలోని కొంతమంది తో కలిసి వెళ్లి దానిని కాపాడారు.. ఆ తర్వాత ఆ తాబేలును  సురక్షితంగా అటవీ శాఖా అధికారులకు అప్పగించారు.. దానిని చూడటానికి జనాలు ఎగబడ్డారు.


అది మామూలు తాబేలు కాదని చాలా అరుదైన తాబేలు జాతి అని అటవీశాఖ అధికారులు అంటున్నారు..కాగా, ఇలాంటి తాబేలును బాలాసోర్‌లోని సుజన్‌పూర్ గ్రామంలో మొదటి సారిగా పసుపు రంగు తాబేలు ఒకటి కనిపించిందని, దాన్ని కూడా తాము రక్షించినట్టు చెబుతున్నారు.. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్ గ్రామ చెరువులో అరుదైన పసుపు తాబేలును గుర్తించారు.. కేవలం పసుపు రంగు మాత్రమే కాదు, మచ్చల తాబేలు కూడా   అరుదైన జాతికి చెందినదిగా అధికారులు చెబుథున్నారు.. మొత్తానికి ఈ పసుపు రంగు తాబేలు మాత్రం చూపరులను ఆకట్టుకుంటోంది.. మీరు ఒకసారి  చూడండి ఎలా వుందో..


మరింత సమాచారం తెలుసుకోండి: