మనిషి ఆరోగ్యంగా ప్రశాంతవంతమైన జీవితానికి వ్యాయామాలు(Yoga) ఇంకా అలాగే ప్రాణాయామం(Pranayama) మొదలైనవి మేలు చేస్తాయని నిపుణులు అంటారు. ముఖ్యంగా యోగాలో భాగంగా చేసే ప్రాణాయామనికి అయితే చాలా ప్రత్యేక స్థానం ఉంది.ఇక దీని ప్రయోజనం ఏమిటంటే శరీరం నుండి వ్యర్ధ పదార్ధాలను బయటకు పంపడంలో ఎంతగానో సహాయపడుతుంది. అంతేకాదు శరీరంలో ఆక్సిజన్ సరఫరాను కూడా పెంచుతుంది. ప్రాణాయామం క్రమం తప్పకుండా చేయడం అనేది ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అయితే పాము ప్రాణాయామం చేయడం మీరు ఎప్పుడైనా చూసారా? లేదు, కానీ ఇలాంటి వీడియో ఈ రోజుల్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో హిందువులు దేవుడిగా భావించి పూజించే నాగుపాము ప్రాణాయామం చేస్తున్నట్లు కనిపిస్తుంది. కింగ్ కోబ్రా ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన పాములలో ఒకటని తెలిసిన సంగతే. నాగుపాము కనుక కాటువేస్తే.. శరీరంలోకి విషం చాలా వేగంగా వ్యాప్తిస్తుంది. కొంచెం ఆలస్యమైనా కాని మనిషి మరణం ఖాయం అవ్వాల్సిందే.ఇక ఎవరైనా సరే ప్రాణాయామం ఎలా చేస్తారో తెలుసా.. ముందు ప్రశాంతంగా పద్మాసనంలో కూర్చోవాలి.


ఆ తరువాత రెండో ముక్కు రంధ్రంతో దీర్ఘ శ్వాస తీసుకోవాలి. నెమ్మదిగా శ్వాసని తీసుకుంటూ పొట్టని బిగపట్టాలి.ఆ తరువాత శ్వాసను నియంత్రిస్తూ.. నెమ్మదిగా శ్వాసను వదిలివేయాలి. ఇలానే ఇప్పుడు ఓ నాగుపాము తనని తాను చుట్టుకుని ప్రశాంతంగా కూర్చుని ఉంది. ఆ తరువాత ఆ కింగ్ కోబ్రా ప్రాణాయామ చేస్తున్నట్లు వీడియోలో మీరు చూడవచ్చు. ఆ పాము గాలిని ముందుగా బయటకు వదులుతుంది. దీంతో దాని శరీరం కూడా చాలా సన్నగా మారుతుంది. ఆ తరువాత మళ్ళీ ఆ పాము శ్వాసను బలంగా తీసుకుంది. వెంటనే శరీరం కూడా పూర్తిగా ఉబ్బుతుంది. అయితే దీనిని చూస్తుంటే ఎవరైనా సరే ప్రాణాయామం చేస్తుందని భావించేలా ఉంది. కానీ పాములు  చాలా కోపంగా ఉన్నప్పుడు కూడా ఇలాగే శ్వాసను తీసుకుంటాయని తెలుస్తోంది.కోబ్రా ప్రాణాయామం చేస్తుందా? అంటూ సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోపై మీరు కూడా ఓ లుక్ వేయండి..

మరింత సమాచారం తెలుసుకోండి: