ఆన్లైన్ ఫుడ్ డెలివరీ యాప్ లు అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలా మంది ఇంట్లో వంట చేసుకోవడం మానేసారు..కేవలం ఆర్డర్ పెట్టుకొని తృప్తి చెందుతున్నారు.ఈ క్రమంలో కస్టమర్లను ఆకర్షించేలా ఫుడ్ డెలివరీ సంస్థలు ఆఫర్లు కూడా అందిస్తున్నాయి.అయితే అదే జనాలను మోసం చేస్తుంది.. నమ్మకం కలిగిందని వాళ్ళకు ఇష్టం వచ్చినట్లు బిల్ ఇస్తున్నారు. మరోవైపు క్వాలిటీ అనేది మారిపొయింది. మనం ఆర్డర్ చేసుకున్న వాటిలో ఏవేవో వస్తున్నాయి కూడా. అయిన జనాలు లెక్క చెయ్యడం లేదు.. దారుణంగా మోసం చేస్తున్నారు. ఇప్పుడు మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.


రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్లేకంటే ఆఫర్లతో తక్కువ ధరకు ఫుడ్ ఇంటికే వస్తుందన్న భావనతో ఎక్కువ మంది ఫుడ్ ఆర్డర్లు చేస్తున్నారు. కస్టమర్ల ఆలోచనను ఆసరాగా చేసుకుంటున్న కొన్ని ఫుడ్ డెలివరీ కంపెనీలు అధిక ధరలతో మోసం చేస్తున్నాయంటూ రాహుల్ కాబ్రా అనే వ్యక్తి తన ఆవేదనను వ్యక్తం చేశాడు. నేరుగా రెస్టారెంట్ కు వెళితే తక్కువ ధరకే మనకు కావాల్సిన ఫుడ్ దొరుకుతుందని, అదే ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలో ఆర్డర్ చేస్తే ఆఫర్లు ప్రకటిస్తూనే కస్టమర్ల నుంచి అధిక సొమ్మును దోపిడీ చేస్తున్నారంటూ రాహుల్ అన్నారు.


తనకు ఎదురైన అనుభవాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. రాహుల్ వెజ్ బ్లాక్ పెప్పర్ సాస్, వెజిటబుల్ ఫ్రైడ్ రైస్, మష్రూమ్ మోమోలు ఆర్డర్ చేశాడు. ఆఫ్‌లైన్ ఆర్డర్‌ బిల్లు సీజీఎస్టీ, ఎస్‌జీఎస్టీతో కలుపుకుని రూ.512 వచ్చింది. ఇదే ఆర్డర్ జోమాటోలో రూ.689.90 ఉంది. అదికూడా రూ. 75 డిస్కౌంట్‌ ఇచ్చిన తర్వాత ఉండటం విశేషం. ఆ క్రమంలో జోమాటో 34.76% ఎక్కువ వసూలు చేసినట్లు రాహుల్‌ తెలిపాడు. ఇందుకు సంబంధించిన రెండు బిల్లులను రాహుల్ కాబ్రా సోషల్ మీడియాలో పోస్టు చేశాడు..అవి కాస్త వైరల్ కావడంతో ఒక్కొక్కరూ ఒక్కో  విధంగా కామెంట్ చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: