ఇలా ఇంటర్నెట్ లోకి వచ్చిన ఎన్నో వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తూ తెగ వైరల్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఇలా సోషల్ మీడియా లోకి వచ్చిన వీడియోలు కొన్ని అందరికీ నవ్వు తెప్పిస్తూ ఉంటే మరికొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఎడారిలో తిరిగే ఒంటె కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఇక ఈ వీడియో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది అని చెప్పాలి. జంతు ప్రేమికుల మదిని కదిలిస్తుంది.
ఒక్కసారి ఈ వీడియో లోకి తొంగి చూస్తే.. హైవే పక్కనే ఒక పెద్ద కొండ ఉంది. అయితే ఆ కొండమీద నుండి ఒక పెద్ద ఒంటె దిగడానికి ప్రయత్నించింది. కాళ్లు పొడవుగా ఉండడంతో ఆ ఒంటెకు కొండ దిగటం చాలా కష్టం గా మారిపోయింది. ఇంకేముంది ఒంటె బ్యాలెన్స్ తప్పి ఒక్కసారిగా కాలుజారి రోడ్డుపై పడిపోయింది. దీంతో ఒంటె మళ్లీ రోడ్డుపై నుంచి లేవ లేదు అని అనుకుంటారు ఈ వీడియో చూసిన తర్వాత. కానీ అదృష్టవశాత్తు ఆ ఒంటె కు ఎలాంటి గాయాలు కాలేదు అని తెలుస్తోంది. కింద పడిన తర్వాత మళ్ళీ వెంటనే లేచి నిలబడి నడవడం మొదలు పెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో కాదు సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోవడం తో ఎంతోమంది జంతు ప్రేమికులు ఆ ఒంటికు ఏదైనా గాయం అయితే తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నారూ.