ఈ భూమ్మీద నూకలు తినే బాకీ ఉంటే ఎలాంటి ప్రమాదం నుండి అయినా  తప్పించుకొని ప్రాణాలతో బయట పడవచ్చు అని చెబుతూ ఉంటారు పెద్దలు. ఈ క్రమంలోనే కొన్ని కొన్ని ఘటనలు చూసిన తర్వాత ఇది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే రెప్పపాటుకాలంలో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అనుకుంటున్న సమయంలో ఊహించని విధంగా ప్రాణాలతో బయట పడితే ఇక ఆ విషయాన్ని ప్రాణాలతో బయటపడిన వారు కూడా నమ్మలేరూ అని చెప్పాలి. ఇప్పుడు జరిగిన ఘటన కూడా ఇలాంటి కోవలోకే వస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.


 ప్రస్తుతం రెప్పపాటుకాలంలో మృత్యువు తప్పడం అంటే ఏంటో ఇక్కడ వైరల్ గా మారిపోయిన వీడియో చూసిన తర్వాత అర్థమవుతుంది. ఇక సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో చూసిన తర్వాత ఒళ్ళు గగుర్పాటుకు గురి కాక మానదు అని చెప్పాలి. కేవలం కొన్ని సెకన్ల తేడా అటూ ఇటూ అయినా ప్రాణాలు గాల్లో కలిసి పోవడమె కానీ చివరికి మహిళ మాత్రం రెప్పపాటుకాలంలో ప్రాణాలతో బయట పడింది. ఇంతకీ ప్రస్తుతం వైరల్ గా మారిపోయిన వీడియో లో ఏముందంటే.. సిగ్నల్ లేక స్టేషన్కు కొంత దూరంలో పట్టాల మధ్య లోనే ఒక రైలు ఆగిపోయింది.


 ఈ క్రమంలోనే ఎంతో మంది ప్రయాణికులు ట్రైన్ దిగి ఇక పక్కనే ఉన్న మరో రైల్వే ట్రాక్ ను  దాటుతున్నారు. ఇక ఇలాంటి సమయంలోనే ఆ గ్రూపులోని ఒక మహిళ లగేజ్ తీసుకుని ట్రాక్ దాటింది. అయితే మరో వైపు నుంచి ఎక్స్ప్రెస్ ట్రైను దూసుకు వస్తుంది. ఆ సమయంలో పక్కన వేచి చూడకుండా మిగిలివున్న లగేజ్ కోసం మళ్ళీ ఇటు వైపు వచ్చింది మహిళ. కేవలం సెకండ్ల వ్యవధిలోనే మహిళ ప్రాణాలతో బయట పడింది. లేదంటే ట్రైన్ వేగానికి ఎక్కడో ఎగిరి పడి ప్రాణాలు కోల్పోయేది. ఈ వీడియోని ఐఏఎస్ అధికారి అవనీష్ శరన్ ట్విట్టర్ వేదికగా షేర్ చేయడం తో వైరల్గా  మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: