ఈ భూమి మీద అతి విశ్వాసంగా ఉండే జీవి ఏది అంటే ప్రతి ఒక్కరు చెప్పే పేరు శునకం అని. ఎందుకంటే ఇప్పటి నుంచి కాదు కొన్ని దశాబ్దాల నుంచి కూడా కుక్క విశ్వాసానికి మారుపేరు గా కొనసాగుతూ ఉంటుంది. అందుకని ఎంతోమంది కుక్కలు పెంచుకోడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు అని చెప్పాలి. ఇటీవలి కాలంలో మనుషులు పెంపుడు కుక్కల మధ్య ప్రత్యేకమైన బాండింగ్ కూడా ఏర్పడుతుంది. అయితే కుక్కలు కేవలం ఇంటికి కాపలా కాయడం కాదు. యజమానులు ప్రమాదంలో ఉన్న సమయంలో ప్రాణాలకు తెగించి వారిని కాపాడేందుకు కూడా సిద్ధంగా ఉంటాయి అన్న విషయం తెలిసిందే.


 ఇక ఇలా కుక్కలు ఎన్నో సాహసాలు చేసిన వీడియోలు సోషల్ మీడియాలో అప్పుడప్పుడూ వైరల్ గా మారిపోతూ ఉంటాయి. ఇక శునకాన్ని ఎక్కడైనా కాపలాగా పెడితే ప్రాణాలకు తెగించి అయినా సరే రక్షణ కల్పిస్తుంది అని అందరికీ తెలుసు. ఇక ఇప్పుడు కుక్క ఎలా మనుషులకు రక్షణ కల్పిస్తుంది అన్న దానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోతుంది. నెలలు నిండని చిన్నారికి ఆ శునకాన్ని కాపలాగా పెట్టారు యజమానులు. ఇలాంటి సమయంలోనే ఆ చిన్నారికి శునకం ఎలా రక్షణ కల్పిస్తుంది అన్నది ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది.


 ఎందుకంటే చిన్నారి బెడ్ పై పడుకొని ఉండగా పక్కనే బాడీగార్డ్ లాగా నిలబడింది నలుపు రంగులో ఉన్న ఆ శునకం. ఆ చిన్నారిని ఎవరైనా ముట్టుకుంటే ఖబర్దార్ అనే విధంగానే సీరియస్గా ఉంది. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న ఒక వ్యక్తి ఆ బుడ్డోడు పై చేయి వేసేందుకు ప్రయత్నించగా వెంటనే అతని చేతిని తొలగించింది. ఇక మరో సారి పక్కనే ఉన్న బుడ్డోడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా చేతిని పట్టుకొని ఎంతో సీరియస్గా లుక్ ఇచ్చింది. ఈ వీడియో గా సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది. పెంపుడు కుక్కలు చిన్నపిల్లలను కూడా కాపాడతాయనే దానికి ఈ వీడియో నిదర్శనంగా నిలిచింది అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: