ఇలా ఇప్పటివరకు ఊసరవెల్లి తన రంగులు మార్చుకునే వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నోసార్లు తెర మీదికి వచ్చి వైరల్ గా మారిపోయాయి. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఊసరవెల్లి గురించి కాదు. ఒక అందమైన పక్షి పక్షి గురించి. కానీ ఊసరవెల్లి కాదు అంతకు మించి అనే రేంజ్ లోనే క్షణ కాలవ్యవధిలో రంగును మారుస్తూ ఉంది పక్షి. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్లో వైరల్ గా మారి పోవడం తో ప్రతి ఒక్కరు ఈ వీడియో ఆశ్చర్యపరుస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఒక వ్యక్తి చేతి పై వాలిన అనాజ్ హమ్మింగ్ బర్డ్ తల అటు ఇటు తిప్పుతూ వేగంగా రంగులు మారుస్తూ ఉండటం ఈ వీడియోలో చూడొచ్చు.
ఇలా రెప్పపాటుకాలంలో పక్షి రంగులు మారుస్తూ ఉండటం చూసి ప్రతి ఒక్కరు సంభ్రమాశ్చర్యాలలో మునిగిపోయాడు అని చెప్పాలి. అయితే ఇక ఈ పక్షి ఈకల్లో పాన్ కేక్ ఆకృతిలో ఉండే ప్రిగ్మెంట్ లే ఇందుకు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక హమ్మింగ్ బర్డ్ తలతిప్పి నప్పుడల్లా కూడా ఈ పిగ్మెంట్ లో కాంతి కిరణాలను మళ్ళించడం వల్ల ఇది రంగులు మారుస్తున్నట్లు అనిపిస్తూ ఉంటుంది అని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఏది ఏమైనా ఊసరవెల్లి కంటే వేగంగా రంగులు మారుస్తున్న ఈ పక్షి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.