పెళ్లి అంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైనది అన్న విషయం తెలిసిందే . ఈ పెళ్లిని మరింత ప్రత్యేకంగా మార్చుకోవడానికి నేటి రోజుల్లో యువతీ యువకులు అందరూ కూడా సరికొత్తగా ఆలోచిస్తూ ఉండటం గమనార్హం. కాగా నేటి రోజుల్లో జరుగుతున్న పెళ్లిళ్లూ.. పెళ్లిళల్లో జరుగుతున్న పలు ఆసక్తికర ఘటనలు  సోషల్ మీడియాలో ఎప్పుడు హాట్ టాపిక్ గా మారి పోతూనే ఉన్నాయి అని చెప్పాలి. ఇక ఇలా పెళ్లిళ్లలో జరిగిన చిత్రమైన ఘటనలకు సంబంధించిన వీడియోలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ తెగ చక్కెర్లు కొడుతున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి ఫైనల్ గా మారిపోయింది.


 సాధారణం గా పెళ్లి సమయంలో వధువు ఎంతో సైలెంట్ గా ఉండిపోతుంది... అందరూ ఏమనుకుంటారో అని కనీసం తల పైకెత్తడానికి కూడా ధైర్యం లేదు అన్న విషయం తెలిసిందే. కానీ ఇటీవలి కాలంలో మాత్రం ఎంతో మంది యువతులు వరుడు తో సమానంగా పెళ్లిని తెగ ఆస్వాదించడం వరుడి తో పోటీపడి ఒకరిపై ఒకరు తలంబ్రాలు వేసుకోవడం లాంటివి కూడా జరుగుతోంది.. ఇక మరికొన్ని వీడియోలో వరుడు వధువు పెళ్లి మండపంలో గొడవపడటం లాంటివి కూడా చేసి అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటాయ్. ఇక్కడ కూడా వధువు ఒక్కసారిగా రెచ్చిపోయింది.


 పెళ్లి మండపం లో అందరి బంధువుల సమక్షంలో పెళ్ళి తంతు ఎంతో ఘనంగా జరుగుతుంది. అయితే పెళ్లి ఆచారం లో భాగంగా వరుడు తన చేతిని ముందుకు చాచేందుకు  ప్రయత్నించాడు. కాని అనూహ్యంగా వధువు వరుడు పై దాడి చేసింది.   అందరూ చూస్తుండగానే వారి ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది అని చెప్పాలి. దీంతో ఒక్కసారిగా అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం అర్థం కాలేదు. తర్వాత వీరి గొడవను ఆపేందుకు అక్కడున్న బంధువులందరూ కూడా ప్రయత్నించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇక వధూవరుల మధ్య ఎందుకు గొడవ జరిగింది అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: