అడవులను నరికివేసి ఎంతోమంది ఇక పెద్ద పెద్ద భవనాలు నిర్మిస్తున్న నేపథ్యం లో అడవుల్లో ఉండే జంతువులు ఇక ఇప్పుడు జనావాసాల్లోకి వస్తూ ఉండటం చూస్తూ ఉన్నాము. గత కొంత కాలం నుంచి తరచూ జనావాసాల్లో చిరుత పులులు సంచరిస్తున్నాయి.. ఎలుగు బంట్లు దాడి చేస్తున్నాయని ఇలా ఎన్నో వార్తలు తెరమీదికి వస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వార్త ఒకటి వైరల్ గా మారి పోయింది. ఏకంగా ఖడ్గమృగం జనావాసాల్లోకి వచ్చేసింది.
రద్దీగా ఉండే పట్టణంలో ఏకంగా ఒక ఖడ్గమృగం దర్జాగా నడుస్తూ ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అయితే ఇటీవలే ఒక ఐఎఫ్ఎస్ అధికారి ఈ వీడియోని ట్విట్టర్ వేదికగా షేర్ చేసి ఇక ఎప్పుడైనా ఖడ్గమృగం మనుషులు ఆవాసాల్లో సంచరించినప్పుడు దాని పట్ల ఎవరూ భయం గందరగోళానికి గురి కావొద్దు అంటూ ఒక వ్యాఖ్యను వీడియో కి జోడించాడు. కాగా రద్దీగా ఉండే నగరంలో ఖడ్గమృగం రోడ్డు పై పరుగులు పెడుతూన్న వీడియో అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంది అని చెప్పాలి.