ఇటీవల సోషల్ మీడియా అందరికీ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఎన్నో రకాల వీడియోలు ప్రతిరోజు వైరల్ గా మారిపోతూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఇలాంటి వీడియోలలో ముఖ్యంగా వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. అయితే వన్యప్రాణులకు సంబంధించి ప్రతి రోజూ ఎన్నో వీడియోలు చూసిన ఎందుకో ప్రతి వీడియో కూడా సరి కొత్తగా అనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇలా సోషల్ మీడియాలో కి ఏదైనా వన్యప్రాణుల సంబంధించిన వీడియో వస్తే ప్రతి ఒక్కరూ అలాగే చూస్తూ ఉండిపోతారు.


 ముఖ్యంగా  అడవుల్లో ఉండే క్రూరమృగాలు తమ ఆహారాన్ని సంపాదించుకోవడం కోసం వేటాడే తీరు.. మరోవైపు ప్రాణాలను బతికించుకోవడం కోసం అడవుల్లో ఉండే శాకాహార జంతువులు తప్పించుకునేందుకు వేసే ఎత్తులు అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి అని చెప్పాలి. అడవుల్లో సింహాలు,చిరుతలు, పులులు, తోడేళ్లు ఇలా అనేక రకాల జంతువులు ఇతర జంతువుల ప్రాణాలను తీస్తూ ఇక వాటిని తమ ఆహారంగా మార్చుకుంటూ ఉంటాయి. ఇక ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి ట్విట్టర్ వేదికగా తెగ చక్కెర్లు కొడుతుంది. ఒక ఎద్దు కి చిరుత కి మధ్య భీకరమైన పోరు జరిగింది.


 కానీ చివరికి భారీకాయం ఉన్న ఎద్దు  చిరుత తో  పోరాటం చేయలేక.. దానికి ఆహారంగా మారిపోయింది. ఈ వీడియోలో చూసుకుంటే రోడ్డు పక్కనే ఒక ఎద్దు పై చిరుతపులి దాడి చేసింది అని తెలుస్తోంది. ఎద్దు మెడ ను తన నోటితో గట్టిగా పట్టుకుంది చిరుతపులి. అయితే రోడ్డు పై ఎద్దు ఉండగా రోడ్డు పక్కనే ఉన్న రైలింగ్ కిందికి నుంచి దాని మెడ పట్టుకుంది చిరుత. చిరుత పంజా నుంచి బయటపడేందుకు ఇక తన ప్రాణాలను కాపాడేందుకు తన సర్వశక్తులూ ఒడ్డింది ఎద్దు . కానీ చిరుత పట్టు ముందు ఎద్దు తప్పించుకోలేక పోయింది. చివరికి అక్కడే కుప్పకూలిపోయి ప్రాణాలను వదిలింది. ఆ తర్వాత ఆ ఎద్దుని  రోడ్డు పక్కకి లాక్కెళ్ళింది చిరుత .

మరింత సమాచారం తెలుసుకోండి: