ఇటీవలి కాలం లో ఇంట్లో కుక్కలను పిల్లులను పెంచుకోవడం ఒక ట్రెండ్ గా మారి పోయింది అన్న విషయం తెలిసిందే. కేవలం సంపన్నులు మాత్రమే కాదండోయ్ సామాన్యులు సైతం ఇలా పెంపుడు జంతువులను పెంచుకోవడమే కాదు వాటిని ఇంట్లో మనిషి లాగానే చూసుకుంటున్నారు. ఏకంగా ఇంట్లో మనుషుల పై చూపించిన ప్రేమ కంటే కాస్త ఎక్కువగానే చూపిస్తున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అని చెప్పాలి. సాధారణంగా పెంపుడు జంతువులకి ఒకేసారి ఆహారం పెట్టిన సమయంలో అవి పోట్లాడుకోవడం లాంటివి చూస్తూ ఉంటాము.


 ఇలా పెంపుడు జంతువులు ఆహారం కోసం పోట్లాడుకోవడం లాంటి వీడియోలు ఎప్పుడూ సోషల్ మీడియా లో వైరల్ గా మారిపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి అని చెప్పాలి. అదే సమయంలో కొన్ని కొన్ని సార్లు పెంపుడు జంతువులు జాతి వివక్ష లేకుండా ఎంతో సామరస్యంగా ఉండడం కూడా అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు కూడా ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి. ఈ వీడియో చూసిన తర్వాత అందరి ముఖాల్లో చిరునవ్వులు చిగురిస్తూ ఉన్నాయి.


 ఇంతకీ ఈ వీడియోలో ఏముందంటే.. ఒక యజమాని ఎంతో ప్రేమగా పెంచుకున్న రెండు పిల్లలకు ఒక గిన్నెలో ఆహారాన్ని అందించాడు. ఇలాంటి ఈ సమయంలో పిల్లలు సాధారణంగా నేనంటే నేను అన్నట్లుగానే ఆహారం తినడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. కానీ ఈ రెండు పిల్లులు మాత్రం అలా చేయలేదు. గొడవ ఎందుకు బ్రో.. నీకు కొంచెం నాకు కొంచెం అన్నట్లుగానే ఐక్యతను చాటాయి. ఒకదాని తర్వాత ఒకటి తినడం మొదలు పెట్టాయి. అచ్చమ్ స్నేహితులు ఫుడ్ షేర్ చేసుకున్నట్టుగానే ఈ రెండు పిల్లులు కూడా తమ ఆహారాన్ని షేర్ చేసుకున్నాయ్ అని చెప్పాలి. ఇది చూసిన నెటిజన్లు మైమరచిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: