సోషల్ మీడియా ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇక అందరూ కూడా సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నారు అనే చెప్పాలి . ఈ క్రమంలోనే నెట్టింట్లో పాపులారిటీ సంపాదించుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారు. ఇక ప్రతిరోజు ఎన్నో రకాల వీడియోలను పోస్ట్ చేయడం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. అయితే ఇలా సోషల్ మీడియాలో లక్షల వీడియోలు ఎప్పుడూ తారస పడుతూనే  ఉంటాయ్. ఒకసారి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు కొత్త కొత్త వీడియోలు కళ్ళముందు వాలిపోతు ఉంటాయి అని చెప్పాలి. ఇలా వెలుగులోకి వచ్చిన కొన్ని వీడియోలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటాయి.


 మరి కొన్ని వీడియోలు భయాందోళనకు గురి చేస్తాయి. కొన్ని వీడియోలు చూడముచ్చటగా ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే జంతువులకు సంబంధించిన వీడియోలు అయితే సోషల్ మీడియాలో ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది. ఇంతకీ ఈ వీడియో లో ఏముంది అని అనుకుంటున్నారు కదా.. ఏకంగా ఒక కుక్క దాని టాలెంటుతో అందరినీ ఫిదా చేసేస్తూ ఉంది. ఇటీవల కాలంలో ఎంతోమంది పెంపుడు కుక్కలకు శిక్షణ ఇస్తూ మనుషుల పనులు కూడా చేయగలవు అని నిరూపిస్తున్నారు.



 ఇక ఇలాంటి వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొట్టాయి. మరి ఇప్పుడు వైరల్ గా మారిపోయిన వీడియోలో చూసుకుంటే ఇక ఎలాంటి ప్రమాదం ఎదురైనా సరే ఎదుర్కొనేలా ఆ యజమాని కుక్కకి ప్రత్యేకమైన శిక్షణ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఒక బంతిని గాల్లోకి ఎగరేసి దానిని క్యాచ్ పట్టాలి అంటూ యజమాని కుక్కను ఆదేశిస్తాడు. దీంతో పరిగెత్తుకుంటూ వచ్చిన కుక్క ఎంతో అలవోకగా గాల్లోకి ఎగిరి ఎంతో ఎత్తులో బంతిని క్యాచ్ అందుకు నేలమీదికి దూకుతుంది. ఇది చూసిన వారు ఆ కుక్క ఇది ఎలా చేయగలిగింది అంటూ ఆశ్చర్యపోతున్నారూ అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: