ఇటీవల కాలంలో ఎంతో మంది వ్యక్తులు ఎలాంటి కారణం లేకుండానే మూగజీవాలను దారుణంగా హింసించడం వంటివి చేస్తూ ఉంటారు. కర్రలతో కొడుతూ కాళ్లతో తన్నుతూ రాక్షస ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఇలా ఎంతోమంది మానవత్వం మరిచిన వ్యక్తులు మూగజీవాలను హింసించడం లాంటి ఘటనలు ఎన్నో సోషల్ మీడియాలో తెరమీదికి వచ్చాయి అని చెప్పాలి. అయితే కొన్ని సార్లు సాదు జంతువులు గా పిలువబడే మూగ జీవాలు కూడా తమను హింసిస్తున్న వారిపై తిరగబడటం లాంటివి చేస్తూ ఉంటాయ్. ఏకంగా కొమ్ములతో కుమ్మేస్తూ ఉంటాయి అని చెప్పాలి.


 ఇలా మూగజీవాలు ఎవరి పైన  అయినా దాడి చేశాయి అంటే చాలు అందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ షికార్లు కొడుతూ ఉంటుంది అని చెప్పాలి. ఇక ఇలా మూగజీవాలు తిరగబడితే అప్పటివరకు వాటి పై దాడిచేసి హింసించిన వారు భయంతో పరుగులు పెడుతూ ప్రాణాలను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇటీవలే ఒక గేదె ను కొట్టిన వ్యక్తికి ఆ గేదె సరైన బుద్ధి చెప్పింది అని చెప్పాలి. ఏకంగా అతనిపై దాడిచేసి ప్రతీకారం తీర్చుకుంది. దీంతో అతని ప్రాణాలు రక్షించుకునేందుకు ఏకంగా దగ్గరలో ఉన్న చెట్టు ఎక్కాడు సదరు వ్యక్తి.  అయినప్పటికీ వదలని గేదె ఏకంగా ఆ వ్యక్తి వెంట పడింది.



 ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ప్రస్తుతం ట్విట్టర్ వేదికగా తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి. ముందుగా ఆ వ్యక్తి గేదె ను ఎంతగానో హింసించాడు. దీంతో కాసేపటి వరకు  భరించిన ఆ గేదె తర్వాత తిరగబడింది. దీంతో భయంతో ఒక్కసారిగా పరుగులు పెట్టాడు సదరు వ్యక్తి. ఈ క్రమంలోనే దగ్గరలో ఉన్న చెట్టు ఎక్కాడు. ఇక అక్కడే ఉన్న గేదె అతను ఎప్పుడూ చెట్టు దిగుతాడా  అని వేచి చూసింది. అతను ఒక్కసారిగా చెట్టుదిగగా.. మళ్ళీ దాడి చేసేందుకు వెళ్ళింది. దీంతో భయం తో మరోసారి అతను చెట్టు ఎక్కడంతో అక్కడే చాలా సేపు నిలబడి పోయింది గేదె.

మరింత సమాచారం తెలుసుకోండి: