సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు ఎక్కడపడితే అక్కడ విషపూరితమైన పాములు కనిపిస్తూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అటు ఎంతో మంది నిపుణులు కూడా వర్షాకాలంలో కాస్త జాగ్రత్తగానే ఉండాలి అని సూచిస్తూ ఉంటారు. అయితే ఇక కొన్ని కొన్ని సార్లు ఏకంగా ఇళ్లల్లోకి కూడా విషపూరితమైన పాములు రావడం లాంటివి జరుగుతూ ఉంటుంది.. ఈ నేపథ్యంలో ఎక్కడైనా పాము కనిపించింది అంటే చాలు ప్రతి ఒక్కరూ భయంతో ఊగిపోతూ ఉంటారు.


 అటు వైపు వెళ్లడానికి కూడా తెగ భయపడిపోతుంటారు అని చెప్పాలి. అయితే ఇలా నేరుగా పామును చూడటానికి భయపడిన వారు అటు సోషల్ మీడియాలో పాముల కు సంబంధించిన వీడియో ఏదైనా ప్రత్యక్షం అయింది అంటే చాలు ఎన్ని పనులు ఉన్నా పక్కన పెట్టి ఎంతో ఆసక్తిగా వీక్షించడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే సాధారణంగా పాము గుడ్లు పెట్టింది అని తెలిస్తే అటువైపు వెళ్లడానికి ఎవరు సాహసం చేయరు. ఎందుకంటే పాము గుడ్లను తాకడానికి ప్రయత్నిస్తే అది ఎంతో దారుణంగా దాడి చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక వ్యక్తి మాత్రం ఇలాంటి సాహసమే చేశాడు.


 అతని పేరు మురళి వాలే. ఇటీవలే ఒక పెద్ద కోబ్రా పామును పట్టుకున్నాడు.  పంట పొలాల్లో ఇటుకలను అమర్చారు రైతులు. ఎంటికలు తీస్తున్న సమయంలో కూలీలకు కోబ్రా గుడ్లు కనిపించాయి. దీంతో అక్కడ సమీపంలోనే పాము తిరుగుతుంది అని భావించి వెంటనే స్నేక్ క్యాచర్ మురళికి సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్ళిన మురళి వాలే ముందుగా గుడ్లు బయటకు తీసాడు. అయితే 7-8 గుడ్లు బయటకు తీసిన తర్వాత ఈ గుడ్లు పెట్టిన పాము 25 వేల వరకు వయసు ఉంటుందని అంచనా వేశారు.


 గుడ్లు తీసిన అనంతరం ఇక కోబ్రా కోసం వెతకడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఒక్కో గుడ్డు తీస్తుండగా ఇంతలో పాము బయటకు వచ్చింది. అతను ఎంతో కోపంతో ఉన్న పాము బుసలు కొడుతూ అతని కరవడానికి దూసుకొచ్చింది. కానీ మురళి వాలే మాత్రం తన దగ్గర ఉన్న స్టిక్ సహాయంతో దానిని ఎంతో చాకచక్యంగా బయటకు తీసి ప్లాస్టిక్ డబ్బాలో వేసాడు. ఇక ఆ తర్వాత ఆ పామును అడవిలో వదిలేసాడు. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త నెట్లో తెగ చక్కెర్లు కొడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: