నాన్న.. అనుక్షణం కుటుంబం కోసం కష్టపడుతూ.. కుటుంబం సంతోషాన్ని తన సంతోషం గా భావిస్తూ ఉంటాడు. అందుకే నాన్న పడే కష్టం గురించి ఎంత గొప్ప పదాలతో వర్ణించిన కూడా అది తక్కువే అవుతూ ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే నాన్న తన కుటుంబం కోసం పడే కష్టం ముందు ప్రతి పదం కూడా చిన్నదే అయిపోతూ ఉంటుంది. అయితే  తల్లి తన బిడ్డలను బరువు అనుకోకుండా 9 నెలలు ఎంతో ప్రేమతో మోసినప్పటికి ఆ తర్వాత లోకం తీరు ను పిల్లలకు పరిచయం చేసేది.. చేయిపట్టుకుని నడిపించేది నీ వెనుక నేను ఉన్నాను అంటూ ధైర్యం ఇచ్చేది నాన్న అని చెప్పాలి.



 అందుకే ప్రతి ఒక్కరూ తమ తమ జీవితానికి హీరో నాన్నే అంటూ చెబుతూ ఉంటారు.  ఇటీవల కాలంలో కొంత మంది తండ్రులు   సొంత పిల్లల పైనే పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. ఇక మరికొందరు కన్న బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఒకవైపు కుటుంబ బాధ్యతలను చూసుకుంటూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు అని చెప్పాలి. ఇక్కడ మనం మాట్లాడుకోబోయే తండ్రి కూడా ఇలాంటి గొప్ప వాడే. ఒకవైపు కుటుంబం కడుపు నింపేందుకు కష్టపడుతూనే మరోవైపు కుమారుడి సంరక్షణ బాధ్యతలు కూడా చూసుకుంటున్నాడు.


 ఇక తండ్రి కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నాడో అన్న దానికి సంబంధించిన వీడియో ట్విట్టర్ లో  వైరల్ గా మారిపోయింది. మధ్యప్రదేశ్లోని జబల్పూర్ కు చెందిన రాజేష్ అనే వ్యక్తి వృత్తిరీత్యా రిక్షా నడుపుతుంటాడు. ఏడాది వయసున్న కుమారుడిని భుజంపై పడుకోబెట్టుకుని రిక్షా తొక్కుతూ ఉన్నాడు.  ఇక ఆ చిన్నారి తండ్రి భుజాలపై  ఎంతో హాయిగా నిద్రపోయాడు. అయితే ఇలా కొడుకు నిద్రకు భంగం కలగకుండా ఒకవైపు లాలిస్తూనే మరోవైపు రిక్షా తొక్కుతూ ఉండటం చూసిన ఎంతోమంది మనసు చలించి పోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: