ఒక్కసారి ఇంటి నుంచి కాలు బయట పెట్టిన తర్వాత మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేంతవరకు అనుక్షణం ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన వీడియోలు చూస్తూ ఉంటే ఎప్పుడు ఎటు వైపు నుంచి రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు దూసుకు వస్తుందో భయపడుతూనే ఉన్నార ప్రతి ఒక్కరు. ఇటీవలి కాలంలో రోడ్డు నిబంధనలు పాటించకుండా ఎంతో మంది నిర్లక్ష్యంగా వాహనాలు నడుపుతూ ఉండటం కారణంగా అమాయకపూ ప్రజల ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఏర్పడింది అన్న విషయం తెలిసిందే.


 వెరసి మన దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కూడా రోడ్డు ప్రమాదాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరిగిపోతోంది అని చెప్పాలి. అయితే కొన్ని కొన్ని సార్లు మాత్రం ఘోరమైన రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో కూడా కేవలం క్షణ కాల వ్యవధిలో ప్రాణాపాయం నుంచి బయటపడటం లాంటివి జరుగుతూ ఉంటాయి. కాగా ఇలాంటివి సీసీటీవీ లో రికార్డ్ అయ్యాయి అంటే చాలు సోషల్ మీడియాలో కి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి ట్విట్టర్లో తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి.


 ఈ వీడియో లో ఒక బాలుడు పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. వీడియో చూసిన తర్వాత అతనికి ఇంకా భూమ్మీద నూకలు బాకీ ఉన్నాయి కాబట్టి బ్రతికాడు అంటూ ప్రతి ఒక్కరు అనుకుంటారు అని చెప్పాలి. కొన్ని సెకండ్ల ఆలస్యమైనా కూడా చివరికి అతడు కార్ కింద పడి నుజ్జు నుజ్జు అయ్యేవాడు. అతను ముందుగా రోడ్డు పక్కన ఉన్న ఒక రైలింగ్ పట్టుకుని కాసేపు నిలబడ్డాడు. ఆ తర్వాత మెల్లగా అక్కడి నుంచి పక్కకు తప్పుకున్నాడు. అంతలో ఒక కారు వేగంగా వచ్చి అక్కడే ఉన్న చెట్టును ఢీకొట్టింది.. ఒకవేళ ఆ బాలుడు క్షణకాలం ఆలస్యమైన ప్రాణాలు కోల్పోయేవాడు  అని చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: