మొన్నటికి మొన్న ఎలుగుబంట్లు కూడా జనావాసాల్లోకి వచ్చిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కానీ నక్క లాంటి జంతువులు జనావాసాల్లోకి రావడం ఇప్పటివరకూ జరగలేదు అని చెప్పాలి. కానీ ఇక్కడ మాత్రం కుటుంబం నివసిస్తున్న ప్రాంతం లోకి వచ్చింది నక్క. ఒక్కసారిగా మహిళపై దాడికి పాల్పడింది. దీనికి సంబంధించిన వీడియో ట్విట్టర్ లో తెగ చక్కెర్లు కొడుతుంది. సాధారణంగా మనుషులను చూడగానే నక్కలు పారిపోవడం జరుగుతూ ఉంటుంది.
ఇక్కడ వీడియో లో కనిపిస్తున్న నక్క మాత్రం మనుషులని చూసిన తర్వాత పారి పోవడం కాదు ఏకంగా పట్టు విడవకుండా మహిళపై దాడి చేస్తూనే ఉంది. ఈ వీడియో లో చూసుకుంటే ఒక మహిళ పార్క్ లో నిలబడి ఫోన్ మాట్లాడుతుంది. ఈ క్రమం లోనే ఇంతలో ఒక నక్క నక్కినక్కి అక్కడికి వచ్చి ఒక్కసారిగా మహిళల పై దాడి చేసింది. భయపడి పోయిన మహిళ దాని నుంచి తప్పించుకునేందుకు తీవ్రం గా ప్రయత్నించారు. నక్క మాత్రం వెనక్కి తగ్గకుండా మహిళ పై దాడి చేస్తూ గాయపరిస్తు ఉంది. ఆమె భర్త అక్కడికి రావడంతో నక్క భయపడి పారిపోయింది. అమెరికాలో ఈ ఘటన జరిగింది.