ఈ సృష్టిలో ఎన్ని బంధాలు ఉన్నా తల్లి ప్రేమ మాత్రం అన్నింటికంటే గొప్పది అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఒక్కసారి కన్నతల్లి దూరమైతే ఆ ప్రేమను పొందడానికి మరో జన్మ ఎత్తాల్సిందే. ఇక ఎవరైనా ఇలా తల్లిని కోల్పోయిన వారు తల్లి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటారూ అని చెప్పాలి. అందుకే ఎన్నో ఏళ్ల నుంచి తల్లికి గొప్ప స్థానాన్ని ఇచ్చి గౌరవించడం లాంటివి చేస్తూ ఉన్నాము మనందరం. అయితే కేవలం మనుషుల్లోనే కాదు నోరులేని జీవాళ్ళో సైతం ఇక ఇలాంటి తల్లి ప్రేమ ఎక్కడ తక్కువ కాదు అనే చెప్పాలి. పిల్లల  విషయంలో జంతువులు తీసుకునే జాగ్రత్తలు ప్రతి ఒక్కరిని కూడా మంత్రముగ్ధుల్ని చేస్తూ ఉంటాయి.


 తల్లి ప్రేమకు కేవలం మనుషులు మాత్రమే కాదు జంతువులు కూడా అతీతం కాదు అనే ఇప్పటికే ఎన్నో రకాల వీడియోలు నిరూపించాయి. తల్లి తన పిల్లలను ప్రమాదం రాకుండా ఎలా చూసుకుంటుంది  అన్న విషయాన్ని తెలిపే ఎన్నో రకాల వీడియోలు ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయిన విషయం తెలిసిందే.  ఇక్కడ ఇలాంటి మరో వీడియో తెగ చక్కెర్లు కొడుతుంది. పెద్ద వాళ్ళు అయితే జంతువులను చూసి భయపడతారు. కానీ చిన్న పిల్లలు మాత్రం ఎందులో జంతువులు అంటే చెప్పలేనంత ఇష్టపడుతూ ఉంటారు. కుక్క పిల్లలు, పిల్లి పిల్లలను ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకుంటారు. ఇక్కడ ఒక చిన్నారి మాత్రం ఏకంగా కొండెంగల బేబీ ని పెంచుకోవడానికి సిద్ధమైంది.



 సాధారణంగా కొండెంగలను  చూస్తే ఎంతో మంది భయపడిపోతుంటారు. కానీ ఇక్కడ చిన్నారి మాత్రం కొండెంగ లతో  ఎంతో చనువుగా ఉంటుంది. ఇక పిల్ల కొండెంగను తల్లి దగ్గర నుంచి తీసుకొని మనసుకు హత్తుకుంది. దీన్ని చూసిన తల్లి కొండెంగ  మాత్రం అభద్రతా భావానికి గురై వెంటనే ఆ చిన్నారి దగ్గర నుంచి తన పిల్లను లాక్కోవడం గమనార్హం. ఇక ఆ తర్వాత ఆ పాప మళ్ళీ కొండెంగ  దగ్గరి నుంచి చిన్న కొండంగను  లాక్కునేందుకు ప్రయత్నించినప్పటికీ తల్లి కొండెంగా  మాత్రం ఆ పాపకు ఎలాంటి హాని కలిగించక పోవటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: