సాధారణంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ ఎన్నో రకాల వీడియోలు తారసపడుతూ ఉంటాయి అన్నది అందరికీ తెలిసిందే. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రతి చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్  లో పోస్ట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా వెలుగులోకి వచ్చిన కొన్ని వీడియోలు మాత్రం ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి అని చెప్పాలి. ముఖ్యంగా జంతువులు పక్షులకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారిపోతూ ఉంటాయి. కొన్ని సార్లు మనుషులు చేసే చిత్ర విచిత్రమైన పనులు కూడా సంచలనం గా మారిపోతూ అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఇలాంటి తరహా వీడియో ఒకటి ట్విట్టర్ వేదికగా తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి.


 సాధారణంగా చిన్న పిల్లలు ఏవైనా ఆట వస్తువులు తో ఆడుకోవడం ఇప్పటివరకు చూశాము. ఇంట్లో ఏదైనా పెంపుడు జంతువు ఉంది అంటే దాని తో సరదాగా ఆడుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. పెంపుడు జంతువులను ఎంతో ప్రేమగా చూసుకుంటూ చిన్నపిల్లలు వాటితో ఆడుకోవడం లాంటి వీడియోలు వైరల్ గా మారిపోయాయి. కానీ ఇక్కడ వీడియోలు చూస్తుంటే మాత్రం ఒక చిన్నారి ఏకంగా పెద్ద సాలీడు లతో ఆడుకుంటూ ఉండటం గమనార్హం. వినడానికి కాస్త విచిత్రంగా ఉన్న ఇక్కడ మాత్రం ఇదే జరిగింది. ఇంట్లో ఉండే చిన్న సాలీడును చూస్తే అందరూ భయపడిపోతుంటారు.


 కానీ ఇక్కడ ఒక చిన్నారి మాత్రం పెద్ద సాలీడును కూడా చేతితో పట్టుకుంటూ ఎంతో సరదాగా ఆడుకుంటుంది. వెబ్ స్పైడర్ అనే పేరు ఉన్న సాలీడు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనది. పరిణామం కూడా చాలా పెద్దగా ఉంటుంది.  ప్రమాదకరమైన సాలీడు తో ఈ చిన్న అమ్మాయి  ఆడుకుంటుంది. సాలీడు నేలపై అటూ ఇటూ వెళ్తుంటే వాటిని పట్టుకుని ఒకచోట చేరుస్తుంది. ఈ వీడియో చూసి నెటిజన్లు అందరూ అవాక్కవుతున్నారు అని చెప్పాలి. ఆ చిన్నారికీ స్పైడర్ గర్ల్ అంటూ నెటిజన్లు కొత్త పేరు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: