ముఖ్యంగా ఏనుగులు వాటి జీవనశైలికి సంబంధించిన వీడియోలు ఎక్కువగా సోషల్ మీడియాలో తారసపడుతుంటాయ్ అన్న విషయం తెలిసిందే. అయితే వైల్డ్లైఫ్ ఫోటోగ్రాఫర్ లు కొన్ని కొన్ని సార్లు ఇక జంతువులకు దగ్గరగా వెళ్లి ఫోటోలు వీడియోలు తీస్తున్న సమయంలో ఇక కెమెరాలను గమనించిన జంతువులు కాస్త చిత్ర విచిత్రంగా ప్రవర్తించడం వంటివి చేస్తూ ఉంటా అన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఒక బుల్లి ఏనుగు ఇలాగే చేసింది. దీంతో ఈ వీడియో కాస్త ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తుంది అని చెప్పాలి. ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ ఏనుగులను వీడియో తీయడానికి వెళ్ళాడు.
ఈ క్రమంలోనే తల్లితో కలిసి ఆడుకుంటున్న ఒక చిన్న ఏనుగు అక్కడ కెమెరా ని చూసింది. ఈ క్రమంలోనే ఒక్కసారిగా కెమెరా మీద దాడి చేసేందుకు పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏయ్.. ఏం చేస్తున్నావ్ అన్నట్లుగా కోపంగా చూస్తూ మీదికి వచ్చింది. ఇలా కెమెరా వద్దకు వచ్చిన తర్వాత ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. ఇలా పిల్ల ఎగుగు చిత్రంగా ప్రవర్తించిన వీడియో మాత్రం ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తూనే ఉంది అని చెప్పాలి. మరి ఇంకెందుకు ఆలస్యం ట్విట్టర్లో వైరల్ గా మారిపోయిన ఈ వీడియో మీరు కూడా చూసేయండి.