ఒకవేళ ఏదైనా విషయంలో మనసు బాగా లేకపోయినా కూడా ఒక మంచి పాట వింటే ఖచ్చితంగా మూడ్ ఒక్కసారి గా మారిపోతూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో సంగీతం ప్రతి మనిషి హృదయాన్ని కదిలిస్తుంది అన్న దానికి నిదర్శనంగా ఎన్నో పాటలు సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారిపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. కేవలం మనుషులు మాత్రమే కాదు జంతువులు కూడా సంగీతాన్ని మైమరచిపోయి ఆస్వాదిస్తూ ఉంటాయి అన్నదానికి నిదర్శనంగా ఇక్కడ ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది.
ఇక్కడ ఒక వ్యక్తి తన చేతిలో గిటార్ పట్టుకొని సంగీతం వాయిస్తూ ఉండగా.. అడవిలో నుంచి అక్కడికి చేరుకున్న ఒక నక్క ఇక అతని ముందు అలాగే కూర్చుండిపోయింది. ఈ క్రమంలోనే సంగీతాన్ని వింటూ ఎంతగానో మైమరచి పోయింది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత మ్యూజిక్ ఆపేయగానే పక్కకు వెళ్లి నట్లు కనిపించిన నక్క మళ్లీ ఒకసారి మ్యూజిక్ వాయించవా అన్నట్లుగానే అతని ముందుకు వచ్చి కూర్చుంది. ఇలా ఏకంగా మనుషులు కనిపిస్తే దాడిచేసే నక్క మ్యూజిక్ కి ఫిదా అయిపోయింది అన్నది మాత్రం ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోపై లుక్కేయండి.