ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కుక్కల ని పెంచుకోవడం ఒక ట్రెండ్ గా మారిపోయింది అనే విషయం తెలిసిందే. మనుషులను నమ్మడం కంటే విశ్వాసానికి మారుపేరైన కుక్కలని ఎక్కువగా నమ్ముతున్నారు మనుషులు.ఈ క్రమంలోనే తమకు ఇష్టమైన కుక్కలను తెప్పించుకుని ప్రేమగా పెంచుకుంటున్నారు. ఏకంగా ఇంట్లో మనిషి లాగానే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అని చెప్పాలి.  అయితే ఎంతోమంది జంతు ప్రేమికులు ఇలా కుక్కలను ఎంతో ప్రేమగా పెంచుకుంటా ఉంటే ఇక్కడ ఒక మహిళ మాత్రం ప్రేమగా పెంచుకునే కుక్క పట్ల కర్కశంగా వ్యవహరించింది.


 అందరూ చూస్తుండగానే కుక్క పిల్లని రోడ్డు మీద దారుణంగా చావ కొట్టింది సదరు మహిళ. ఇందుకు సంబంధించిన వీడియో కాస్త ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఆగ్రా లో వెలుగులోకి వచ్చింది. ఇక ఈ వీడియో చూసిన ఎంతోమంది జంతు ప్రేమికులు అల్లాడిపోతున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అభం శుభం తెలియని మూగజీవాల పట్ల ఇంత కర్కశంగా ప్రవర్తించడం ఏంటి అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈ వీడియోలో చూసుకుంటే ఓ మహిళ తన పెంపుడు కుక్కను వెంట తీసుకొని వచ్చింది.


  జనాలు ఎక్కువగా ఉండడం తో ఆ కుక్క అరవడం మొదలు పెట్టింది. అరవకు అని ఆ మహిళ కుక్కను హెచ్చరించిన అని అరవడం ఆపలేదు. దీంతో కోపం తో ఊగి పోయింది. మొదట కేవలం కుక్కతో మాట్లాడుతున్నట్లుగా ప్రవర్తించిన సదరు మహిళ అంతలోనే విచక్షణ కోల్పోయింది. దీంతో ఆ కుక్కను తీసుకొని నేలకేసి కొట్టింది. ఇదంతా చూస్తున్న వారు ఒక్క సారిగా అవాక్కయ్యారు. అక్కడ ఏం జరుగుతుందో కాసేపు అర్థం కాలేదు. తర్వాత ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు సదరు మహిళ పై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: