ఇక చిన్నారులు తెలిసీ తెలియక చేసిన పని చివరికి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి తీసుకు వస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇప్పుడు ఇలాంటి తరహా వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతుంది అని చెప్పాలి. అందరు పిల్లల్లాగానే ఇక్కడ ఒక చిన్నారి కూడా సైకిల్ పై అటు ఇటు తిరుగుతూ ఆడుకుంటూ ఉంది. ఇలాంటి సమయంలోనే ఒక్కసారిగా ప్రమాదం బారిన పడేది. కానీ రెప్పపాటు కాలంలో అక్కడ ఉన్న వ్యక్తులు ఆ చిన్నారిని రక్షించారు. లేకపోతే చివరికి తల పగిలి ప్రాణాలు పోయేవి అని చెప్పాలి.
ఈ క్రమంలోనే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ వేదికగా వైరల్ గా మారిపోయిన ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు అవాక్కవుతున్నారు అనే చెప్పాలి. ఇక ఈ వీడియోలో చూసుకుంటే రోడ్డు పక్కన ముగ్గురు పెద్దవారు ఒక బాలుడు నిలబడి ఉన్నారు. ఈ క్రమంలోనే వారి పక్కన ఒక పొడవాటి స్తంభం కూడా ఉంది. చిన్నారి రోడ్డు దాటే క్రమంలో సైకిల్పై వేగంగా దూసుకు వచ్చింది. కానీ ఆ చిన్నారి ముందున్న స్తంభాన్ని మాత్రం గమనించలేకపోయింది. ఇది గమనించిన ఫుట్పాత్ పై ఉన్న వ్యక్తి వేగంగా వెళ్లి బాలికను పట్టుకున్నాడు. తద్వారా ఆ బాలిక చిన్న గాయాలతో బయటపడింది అని చెప్పాలి.